King100 Movie: నాగార్జునకు విలన్‌గా టబు.. కింగ్ 100వ సినిమాపై క్రేజీ బజ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తూ..

King100 Movie: టాలీవుడ్ లో ఓ క్రేజీ అప్డేట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు జోడీ మళ్లీ స్క్రీన్ పై కనిపించనుంది. అయితే ఈసారి నాగ్ సరసన హీరోయిన్ గా కాకుండా అతనికి విలన్ గా టబు కనిపించనుండటమే అసలు విశేషం.

Published on: Jul 6, 2026, 14:30:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

King100 Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాడు. వర్కింగ్ టైటిల్ ‘కింగ్ 100’గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక సెన్సేషనల్ క్యాస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఏకంగా 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నాగ్ కు జోడీగా టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ టబు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వెరైటీ ఇండియా కథనం వెల్లడించింది. అయితే ఈసారి ఆమె హీరోయిన్ కాదు, పవర్ఫుల్ విలన్ అవతారమెత్తడం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హాట్ టాపిక్.

King100 Movie: నాగార్జునకు విలన్‌గా టబు.. కింగ్ 100వ సినిమాపై క్రేజీ బజ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తూ..
King100 Movie: నాగార్జునకు విలన్‌గా టబు.. కింగ్ 100వ సినిమాపై క్రేజీ బజ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తూ..

అప్పుడు నిన్నే పెళ్లాడతా అంటూ..

1996లో వచ్చిన రొమాంటిక్ డ్రామా 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఊపేసిన నాగార్జున, టబు.. మళ్లీ ఇన్నేళ్లకు ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్నో అవార్డులు కొల్లగొట్టింది. ఆ తర్వాత 'సిసింద్రీ', 'ఆవిడా మా ఆవిడే' (1998) లాంటి సినిమాల్లో కలిసి నటించి స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. అప్పటినుంచి మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఏ ప్రాజెక్ట్ చేయలేదు.

ఇన్నేళ్లకు ఆడియన్స్ కు ఒక సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి డైరెక్టర్ ఆర్.ఏ. కార్తీక్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది. నాగార్జున కటౌట్ కు సరిపోయేలా టబు క్యారెక్టర్ ను చాలా క్రూరంగా డిజైన్ చేశారని వెరైటీ ఇండియా కథనం తెలిపింది.

నెగిటివ్ రోల్స్ లో టబు విశ్వరూపం

నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం టబుకు కొత్తేం కాదు. ‘మక్బూల్’లో నిమ్మి పాత్ర, 'ఫితూర్' లో బేగం హజ్రత్ జాన్, 'హైదర్' లో గజాలా మీర్ క్యారెక్టర్స్ లో టబు తన యాక్టింగ్ విశ్వరూపం చూపించింది.

ముఖ్యంగా 'అంధాధున్' లో ఏమాత్రం కనికరం లేని సిమి క్యారెక్టర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ మైండ్ లో అలా బలంగా ఉండిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ గ్రీకువీరుడికి విలన్ గా టబు పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అటు ఇంటర్నేషనల్.. ఇటు పాన్ ఇండియా క్రేజ్

రీసెంట్ గా టబు హారర్-కామెడీ మూవీ 'భూత్ బంగ్లా' లో అక్షయ్ కుమార్, వామికా గబ్బి, పరేష్ రావల్ తో కలిసి మెప్పించింది. అలాగే ఇంటర్నేషనల్ ప్లాట్ ఫామ్ హెచ్ బీ ఓ (HBO) సిరీస్ 'డ్యూన్: ప్రొఫెసీ' లో సిస్టర్ ఫ్రాన్సెస్కా క్యారెక్టర్ తో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి గ్లోబల్ రీచ్ ఉన్న సీనియర్ నటి 'కింగ్ 100' లోకి రావడం సినిమా లెవెల్ ను అమాంతం పెంచేసింది.

మరోవైపు నాగార్జున ట్రాక్ రికార్డ్ కూడా మామూలుగా లేదు. రామ్ గోపాల్ వర్మ 'శివ' (1989) తో హిందీలో ఎంట్రీ ఇచ్చి ఖుదా గవా, ద్రోహి, క్రిమినల్, జఖ్మ్, ఎల్ఓసీ కార్గిల్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో తనదైన మార్క్ వేశాడు. చివరిగా 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ' తో పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, రష్మిక మందన్న తో కలిసి చేసిన 'కుబేర' సినిమాతో కూడా నాగ్ భారీ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు తన 100వ సినిమాతో టబుకి గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టడం గ్యారెంటీ.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More