Nagarjuna: బిగ్ బాస్ 10 కోసం కింగ్ నాగార్జున రికార్డ్ రెమ్యునరేషన్.. హోస్టింగ్‌కు అన్ని కోట్లా? టెలివిజన్ లో సంచలనం!
Nagarjuna: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్’ నుంచి 10వ సీజన్ రాబోతుంది. ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. అందుకు గాను అతను రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు టాక్.
Nagarjuna: తెలుగు టెలివిజన్ రంగాన్ని ఊపేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త సీజన్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ 10 తెలుగు స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) తనదైన స్టైలిష్ హోస్టింగ్‌తో ఈ షోను గత కొన్ని సీజన్లుగా విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు కొత్త సీజన్ కోసం నాగ్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు టాక్.

హోస్ట్ గా నాగార్జున
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. గత కొన్ని సీజన్లుగా అతనే షోను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్ వస్తే చాలు నాగ్ ఇచ్చే క్లాసులు, కంటెస్టెంట్లపై వేసే పంచ్‌ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు మైలురాయి లాంటి 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' తో ఆయన మళ్లీ హోస్ట్‌గా అలరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ఈ సీజన్ కోసం ఆయన తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సీజన్ 9 కంటే భారీగా
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హోస్టింగ్ కోసం నాగార్జున ఏకంగా రూ. 40 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను అందుకోబోతున్నారటా. ఇప్పుడీ టాపిక్ సంచలనంగా మారింది.
గత సీజన్ (సీజన్ 9) లో నాగార్జున దాదాపు రూ.35 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి షో రేటింగ్‌లు, క్రేజ్, సీజన్ 10 ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ నాగార్జున అడిగినంత ఇవ్వడానికి వెనకాడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్ గత సీజన్ కంటే ఈసారి రూ.5 కోట్లు అదనంగా పెరగడం విశేషమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
హైయెస్ట్ పెయిడ్ హోస్ట్
ఈ రికార్డ్ బ్రేకింగ్ అమౌంట్‌తో సౌత్ ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హోస్ట్‌లలో నాగార్జున అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నాగార్జున బ్రాండ్ వాల్యూ వల్లే బిగ్ బాస్ షోకు భారీగా టీఆర్‌పీ (TRP) రేటింగ్‌లు, స్పాన్సర్‌షిప్స్ వస్తుంటాయి. అందుకే స్టార్ మా, ఎండెమోల్ షైన్ ఇండియా సంస్థలు ఈ భారీ పారితోషికానికి ఓకే చెప్పినట్లు టాక్.
బిగ్ బాస్ తెలుగుకు ఇది మైలురాయి లాంటి 10వ సీజన్ కావడంతో ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు కూడా మునుపటి కంటే చాలా ఇంటెన్స్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారటా. ఇప్పటికే అగ్నిపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


