Nagarjuna Dhurandhar 2 Review: మైండ్ బ్లోయింగ్ రైడ్.. నాగార్జున ధురంధర్ 2 రివ్యూ.. అన్నపూర్ణ స్టూడియోలో ప్రాసెసింగ్

Nagarjuna Dhurandhar 2 Review:  ధురంధర్ 2 సినిమాపై మరో తెలుగు స్టార్ హీరో ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాన్ని అద్భుతమైన రైడ్ అని అక్కినేని నాగార్జున కొనియాడారు. కేవలం 4 రోజుల్లోనే రూ.750 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 

Published on: Mar 23, 2026, 13:57:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రంపై తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం ఎక్స్ (X) వేదికగా ఈ సినిమాను అద్భుతమైన రైడ్ అని అభివర్ణించారు. "ఈ చిత్రం నా మనసును కదిలించింది, దీని గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

నాగార్జున ధురంధర్ 2 రివ్యూ
నాగార్జున ధురంధర్ 2 రివ్యూ

అన్నపూర్ణ స్టూడియోస్ గర్వకారణం

దర్శకుడు ఆదిత్య ధర్, టెక్నికల్ టీమ్ పనితీరును నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. ధురంధర్ 2 సినిమా సౌత్ ఇండియా లోకలైజేషన్, డాల్బీ సినిమా ప్రాసెసింగ్ తమ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగడం గర్వంగా ఉందని నాగ్ చెప్పారు. సినిమా మేకింగ్ ప్రమాణాలను ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు.

నాగార్జున రివ్యూ

‘‘అద్భుతమైన సినిమా ధురంధర్ ది రివేంజ్ ను చూశా. వాట్ ఏ రైడ్. ఇది మైండ్ బ్లోయింగ్ మూవీ. దీని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఫిల్మ్ మేకింగ్ ను మార్చిన సినిమాల్లో ఇది ఒకటి. ఇన్‌స్పైరింగ్‌ డైరెక్టర్ ఆదిత్య ధర్ కు కంగ్రాచ్యులేషన్స్. మొత్తం టీమ్ కు, నటులకు అభినందనలు’’ అని తన రివ్యూలో నాగార్జున రాసుకొచ్చారు.

రాజమౌళి కూడా

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ధురంధర్ 2 సినిమాను చూసి ఫిదా అయిన సంగతి తెలిసిందే. ధురంధర్ సినిమా మొదటి భాగం కంటే 'ది రివెంజ్' స్కేల్, ఆత్మ పరంగా ఒరిజినల్‌ను అధిగమించిందని రాజమౌళి ప్రశంసించారు. రణ్‌వీర్ సింగ్ పోషించిన హమ్జా, జస్కిరత్ సింగ్ రంగీ పాత్రల లోతు అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు.

రికార్డుల వేట

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ 2 బాక్సాఫీస్ మోత మోగిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే భారతదేశంలో రూ.450 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు వసూలు చేసింది. వరుసగా రెండు రోజులు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.

మొదటి భాగం ధురంధర్ మూవీ సాధించిన రూ.1300 కోట్ల కలెక్షన్ల రికార్డును ధురంధర్ 2 సునాయాసంగా బద్దలు కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పాకిస్థాన్ గడ్డపై గూఢచారి యుద్ధం

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ధురంధర్ సీక్వెల్, పాకిస్థాన్‌లోని లియారీ ముఠాల్లోకి చొరబడిన భారత గూఢచారి కథాంశంతో సాగుతుంది. ముఠా లోపలి నుంచి ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూల్చివేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More