Dhurandhar 2 Collections: ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 4 రోజుల్లోనే బాహుబలి, దంగల్ రికార్డులు బ్రేక్.. ఎన్ని కోట్లంటే?

Dhurandhar 2 Collections: ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ ఊచకోత కొనసాగిస్తోంది. అద్భుతమైన రెస్పాన్స్ తో కలెక్షన్ల మోత మోగిస్తోంది. థియేటర్లో రిలీజైన నాలుగు రోజులకే అనూహ్యమైన కలెక్షన్లతో ‘బాహుబలి’ రికార్డును ధురంధర్ 2 బ్రేక్ చేసింది. ఈ సినిమా డే4 వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.

Published on: Mar 23, 2026, 05:38:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ, రికార్డులను బ్రేక్ చేస్తోంది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇక్కడ చూసేయండి.

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్
రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్

ధురంధర్ 2 కలెక్షన్లు

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ ఊచకోత మామూలుగా లేదు. ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం ఆదివారం (మార్చి 22) ఒక్కరోజే ఈ చిత్రం ఇండియాలో రూ.114.85 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో ధురంధర్ 2 మొత్తం ఇండియన్ కలెక్షన్లు రూ.454.12 కోట్లకు చేరుకున్నాయి. నాలుగు రోజుల్లోనే ఇండియాలో అదిరే వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.

బాహుబలి రికార్డు

ధురంధర్ 2 మూవీ రికార్డుల దుమ్ము దులుపుతోంది. బాక్సాఫీస్ దగ్గర అన్ బీటెన్ రన్ తో ఈ సినిమా దూసుకెళ్తోంది. ప్రభాస్-రాజమౌళిల విజువల్ వండర్ 'బాహుబలి' (రూ.421 కోట్లు) కలెక్షన్ల రికార్డును ధురంధర్ 2 దాటేసింది. అంతకంటే ముందు అమీర్ ఖాన్ ఆల్-టైమ్ హిట్ 'దంగల్' (రూ.387 కోట్లు) ఇండియా లైఫ్ టైమ్ కలక్షన్ల రికార్డునూ ధురంధర్ 2 బ్రేక్ చేసింది.

నాలుగు రోజుల వసూళ్లు

ప్రీమియర్‌ల ద్వారా రూ.43 కోట్లు రాబట్టిన ధురంధర్ 2 సినిమా, గురువారం రూ.102.55 కోట్లతో గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది. శుక్రవారం రూ.80.72 కోట్లు, శనివారం రూ.113 కోట్లు వసూలు చేసి తన జోరును ఏమాత్రం తగ్గకుండా కొనసాగించింది.

ఆదివారం నాడు దేశవ్యాప్తంగా 8326 షోలలో 77.4% ఆక్యుపెన్సీతో అద్భుతమైన వసూళ్లు రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. వీకెండ్ ముగిసేసరికి సినిమా వసూళ్లు సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేశాయని చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా

ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 జోరు కొనసాగుతోంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్లు మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు దాటింది. ఇప్పుడు రూ.650 కోట్లకు దగ్గరగా ధురంధర్ 2 వసూళ్లు ఉన్నాయి.

ధురంధర్ 2 గురించి

ఆదిత్య ధర్ రాసి, దర్శకత్వం వహించిన సీక్వెల్‌ ధురంధర్ 2లో రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు. సినిమా మేకింగ్ వాల్యూస్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్లాయని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషలలో ఈ చిత్రం విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద తన సునామీని కొనసాగిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More