Dhurandhar 2: హైదరాబాద్ థియేటర్‌లో 'ధురంధర్ 2' రచ్చ.. ఒకే స్క్రీన్‌పై హిందీ, తెలుగు భాషల టిక్కెట్లు.. ఫ్యాన్స్ ఫైటింగ్!
Dhurandhar 2: హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లో 'ధురంధర్ 2' సినిమా ప్రదర్శనలో గందరగోళం తలెత్తింది. ఒకే స్క్రీన్‌పై హిందీ, తెలుగు వర్షన్ లో మూవీ టిక్కెట్లు అమ్మడంతో ప్రేక్షకుల మధ్య గొడవ జరిగింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. నగరంలోని నెక్స్ట్ గెలేరియా మాల్‌లోని పీవీఆర్ (PVR) మల్టీప్లెక్స్‌లో సినిమా ప్రదర్శన సమయంలో పెద్ద గొడవ జరిగింది. ఒకే షోకి హిందీ, తెలుగు వెర్షన్లకు టిక్కెట్లు అమ్మడమే ఈ వివాదానికి కారణమైంది.

ఒకే స్క్రీన్.. రెండు భాషలు
సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో వేర్వేరు భాషలకు వేర్వేరు స్క్రీన్‌లు ఉంటాయి. కానీ ఇక్కడ బుక్‌మైషో యాప్‌లో పొరపాటున ఒకే స్క్రీన్‌పై తెలుగు, హిందీ వెర్షన్లకు ధురంధర్ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఏ భాషలో సినిమా ప్లే చేయాలనే దానిపై ప్రేక్షకులు ఒకరితో ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు.
థియేటర్‌లో పోలీసుల ఎంట్రీ
సినిమా స్టార్ట్ కావడానికి ముందు కాక్ టైల్ 2 మూవీ ట్రైలర్ ప్రోమో ప్లే అవుతున్న సమయంలోనే ఈ గొడవ మొదలైంది. "మేము తెలుగు వెర్షన్ టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకున్నాం" అని కొందరు ప్రేక్షకులు కేకలు వేయడం వీడియోల్లో వినిపించింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ప్రేక్షకులను శాంతింపజేయాల్సి వచ్చింది.
మెట్లపై కూర్చుంటాం
తమకు నచ్చిన భాషలోనే సినిమా ప్రదర్శించాలని, లేదంటే మరో స్క్రీన్ కేటాయించాలని ప్రేక్షకులు డిమాండ్ చేశారు. ఒకవేళ వీలు కాకపోతే థియేటర్ మెట్లపై కూర్చుని అయినా సినిమా చూస్తామని యాజమాన్యాన్ని బెదిరించారు. చివరకు థియేటర్ యాజమాన్యం హిందీ వెర్షన్‌ను ప్లే చేయడంతో గొడవ సద్దుమణిగింది.
సోషల్ మీడియాలో జోకులు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "సినిమా ఇప్పటికే 4 గంటల నిడివి ఉంది, ఇప్పుడు ఇది మరో గంట అదనపు వినోదం" అని ఒకరు కామెంట్ చేశారు. "ఫస్ట్ హాఫ్ తెలుగులో, సెకండ్ హాఫ్ హిందీలో వేస్తే సరిపోతుంది కదా" అని మరొకరు సెటైర్లు వేశారు.
మరికొందరు ప్రేక్షకులు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని ఉంటే ఇలాంటి గోల ఉండేది కాదని సరదాగా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా 'ధురంధర్ 2' క్రేజ్ వల్ల ఇలాంటి గందరగోళం జరగడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ధురంధర్ 2 గురించి
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ 2 మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ముందుగా హిందీ వర్షన్ లోనే థియేటర్లకు వచ్చింది. కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా దక్షిణాది వెర్షన్ల ప్రదర్శన వాయిదా పడింది. CBFC చివరికి మార్చి 19న డబ్బింగ్ వెర్షన్లకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇతర భాషల్లో ధురంధర్ 2 మార్చి 21న రిలీజ్ అయింది. ధురంధర్ 2 మూవీ మూడు రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


