Venkatesh Dhurandhar 2: వెంకీ మామ కూడా ధురంధర్ 2 రివ్యూ ఇచ్చేశాడు.. ఇదీ తెలుగు హీరోల గొప్పతనం.. నెటిజన్ల రియాక్షన్
Venkatesh Dhurandhar 2: ధురంధర్ 2 సినిమాపై మనసు పారేసుకున్న తెలుగు హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా చేరిపోయాడు. ఈ సినిమాపై తనదైన స్టైల్లో వెంకీ మామ రివ్యూ ఇచ్చాడు. దీంతో ఇదీ తెలుగు హీరోల గొప్పతనమంటూ నెటిజన్లు రియాక్టవుతున్నారు.
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’పై తెలుగు హీరోలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రవితేజ ఇప్పటికే ధురంధర్ 2పై తమ రివ్యూలను చెప్పేశారు. ఇప్పుడీ లిస్ట్ లో విక్టరీ వెంకటేష్ కూడా చేరాడు. ధురంధర్ 2 సినిమాపై తన స్టైల్లో వెంకీ మామ రివ్యూ ఇచ్చాడు.

వెంకటేష్ ధురంధర్ 2 రివ్యూ
ఇండియన్ సినీ హిస్టరీలో సెన్సేషన్ గా మారిన ధురంధర్ 2 మూవీపై వెంకటేష్ మనసు పారేసుకున్నాడు. ఈ మూవీ ఆయనకు తెగ నచ్చేసింది.
‘‘ధురంధర్ ది రివెంజ్ కు ఫిదా అయిపోయా. ఎప్పటిలాగే రణ్‌వీర్ సింగ్ బ్రలియంట్ గా చేశాడు. ఎంతో కంట్రోల్ తో జస్కిరత్, హమ్జా క్యారెక్టర్లకు ప్రాణం పోశాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ అతనే కనిపించాడు. అతని కళ్లు ఎంతో ఎమోషన్ పండించాయి. చూపు తిప్పుకోలేకపోయా’’ అని ఎక్స్ లో వెంకటేష్ రాసుకొచ్చాడు.
ఎంతో ధైర్యం
‘‘ధురంధర్ లాంటి సినిమాను తీయాలంటే ఎంతో ధైర్యం, విజన్, పట్టుదల ఉండాలి. ఆదిత్య ధర్ ప్రతి విషయాన్ని బాగా చూపించాడు. అతను క్రియేట్ చేసిన ప్రపంచం అద్భుతం. నాలుగు గంటలు అలా గడిచిపోయాయి’’ అని ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ పై వెంకీ మామ ప్రశంసలు కురిపించాడు.
మిస్ కాకూడని
‘‘స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి మాధవన్ అదరగొట్టాడు. సంజయ్ దత్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ అమేజింగ్ గా చేశారు. శాశ్వత్ సచ్ దేవ్ సోల్ పుల్ మ్యూజిక్ సినిమాతో పాటు సాగిపోయింది. థియేటర్లో మిస్ కాకూడని అనుభూతి ఇది. మొత్తం టీమ్ కు అభినందనలు’’ అని వెంకటేష్ ఆదివారం (మార్చి 22) ఎక్స్ లో పేర్కొన్నాడు.
తెలుగు హీరోలు
ధురంధర్ 2 మూవీ పట్ల తెలుగు హీరోలు స్పందించిన తీరుపై నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోల గొప్పతనం ఇదీ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా మంచి సినిమాను ఎంకరేజ్ చేస్తారని తెలుగు హీరోలను పొగిడేస్తున్నారు.
గతంలో బాహుబలి సినిమాల విషయంలో బాలీవుడ్ లోని కొంతమంది సెలబ్రిటీలు చిన్నచూపు చూసిన సంగతిని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కానీ తెలుగు హీరోలు అలాంటి వాళ్లు కాదని మరోసారి తమ పోస్టుల ద్వారా గట్టిగా చెప్తున్నారు.
ధురంధర్ 2 గురించి
ధురంధర్ 2 మూవీ మార్చి 19న రిలీజ్ అయింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


