Mahesh Bhatt: రామాయణంలో రణ్‌బీర్‌ను చూసి కంటతడి పెట్టిన పిల్లనిచ్చిన మామ.. మహేష్ భట్ ఏమన్నారంటే?

Mahesh Bhatt: బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తన అల్లుడు రణబీర్ కపూర్ నటించిన 'రామాయణం' చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీరాముడి పాత్రలో రణబీర్ ఒదిగిపోయిన తీరు, ముఖ్యంగా శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లే ఇంటర్వెల్ ఘట్టం చూసి తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని మహేష్ భట్ అన్నారు.

Published on: Nov 6, 2026, 18:24:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mahesh Bhatt: 'రామాయణం' (Ramayana) మూవీకి అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అయితే శ్రీరాముడి పాత్రలో కనిపించిన బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌కు తన సొంత కుటుంబం నుంచి లభించిన అభినందనలు అత్యంత ప్రత్యేకమైనవిగా నిలిచాయి. రణబీర్ మామ, ప్రముఖ దర్శక-నిర్మాత మహేష్ భట్ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తన ఎమోషన్స్ ను పంచుకుంటూ అల్లుడి నటనను ఆకాశానికెత్తేశారు.

Mahesh Bhatt: రామాయణంలో రణ్‌బీర్‌ను చూసి కంటతడి పెట్టిన పిల్లనిచ్చిన మామ.. మహేష్ భట్ ఏమన్నారంటే?
Mahesh Bhatt: రామాయణంలో రణ్‌బీర్‌ను చూసి కంటతడి పెట్టిన పిల్లనిచ్చిన మామ.. మహేష్ భట్ ఏమన్నారంటే?

“కన్నీళ్లు దాచుకోవడానికి ప్రయత్నించా.. కానీ సాధ్యపడలేదు”

ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ భట్ మాట్లాడారు. "ఇంటర్వెల్ కంటే ముందు శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి బయలుదేరే సన్నివేశం రాగానే నా గొంతు ఎండిపోయింది. కన్నీళ్లు ఆపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను. నా చుట్టూ ఉన్న యంగ్ ఫిల్మ్‌మేకర్స్, రచయితలకు నేను రణబీర్ మామగారిననే విషయం తెలుసు. లైట్లు వేయగానే నా కళ్లలోని నీళ్లను దాచడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. అద్భుతమైన అనుభవాలు మనల్ని నిశ్శబ్దంగా మార్చేస్తాయి" అని తెలిపారు.

రాముడిలో దైవత్వాన్ని స్పృశించాడు.. యశ్ రావణుడిగా మెప్పించాడు

దర్శకుడు నితేష్ తివారీ శ్రీరాముడు, రావణాసురుడి పాత్రలను ఎంతో సున్నితంగా, పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించారని మహేష్ భట్ ప్రశంసించారు. లంకేశ్వరుడి పాత్రలో రాకింగ్ స్టార్ యశ్ నటన తనను మంత్రముగ్ధుడిని చేసిందని, ఆయనకున్న మాస్ ఇమేజ్‌ను దర్శకుడు నితేష్ చాలా పద్ధతిగా, బ్యాలెన్స్‌డ్‌గా నియంత్రించారని అభిప్రాయపడ్డారు.

ఇక రణబీర్ స్క్రీన్ పైకి వచ్చి చేతులు జోడించి నమస్కరించిన క్షణంలో.. అతను తనలోని దైవత్వాన్ని స్పృశించినట్లు అనిపించిందని, ఇప్పటివరకు అతని కెరీర్‌లో ఏ సినిమా కూడా బయటకు తీయని ఒక గొప్ప నటుడిని ఇందులో చూశానని మహేష్ భట్ అన్నారు.

రామాయణం సెట్స్‌లో చిన్నారి రాహా.. అలియా భట్ ఎమోషనల్ పోస్ట్

మరోవైపు రణబీర్ భార్య, నటి అలియా భట్ తమ కుమార్తె రాహాతో కలిసి 'రామాయణం' సెట్స్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రణబీర్ కష్టాన్ని ప్రశంసిస్తూ.. "ఈ సినిమా కోసం నువ్వు నీ సర్వస్వాన్ని ధారపోశావు. అంతటి కష్టపడే తత్వంలోనూ చిన్నారి రాహా కోసం సమయాన్ని కేటాయించడం నీకే సాధ్యమైంది. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. కొన్ని కథలు మనందరికంటే చాలా పెద్దవి.. అందులో రామాయణం ఒకటి" అని ఆమె క్యాప్షన్ జోడించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More