...
...
Next Story

Mrunal Thakur: మృణాల్.. నువ్వు మాకు కావాలి.. ఇక్కడి హీరోనే పెళ్లి చేసుకో..: అల్లు అరవింద్

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ను ఉద్దేశించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నువ్వు మాకు కావాలి అంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా పెళ్లి చేసుకో అని అన్నాడు. గతంలో లావణ్య త్రిపాఠీని ఇలాగే దీవిస్తే వరుణ్‌ను పెళ్లి చేసుకుందని చెప్పాడు.

Published on: Apr 12, 2026, 15:35:46 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Mrunal Thakur: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ ‘సీత’ మృణాల్ ఠాకూర్ గురించి ఆయన చేసిన ఒక ‘పెళ్లి’ కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్ లో అరవిండ్ మాట్లాడాడు.

మృణాల్‌కు అల్లు అరవింద్ బంపర్ ఆఫర్

Mrunal Thakur: మృణాల్.. నువ్వు మాకు కావాలి.. ఇక్కడి హీరోనే పెళ్లి చేసుకో..: అల్లు అరవింద్
Mrunal Thakur: మృణాల్.. నువ్వు మాకు కావాలి.. ఇక్కడి హీరోనే పెళ్లి చేసుకో..: అల్లు అరవింద్

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈమె.. ఆ తర్వాత 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు మరింత దగ్గరైంది. మృణాల్ నటనకు, ఆమె పద్ధతికి ఫిదా అయిన అల్లు అరవింద్.. ఆమెను ఎలాగైనా టాలీవుడ్‌లోనే శాశ్వతంగా ఉంచేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

ఇటీవల జరిగిన డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్ లో మృణాల్ ఠాకూర్ స్టేజ్ కింద ఉండగా.. అల్లు అరవింద్ మైక్ తీసుకుని సరదాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ అమ్మాయిని (లావణ్య త్రిపాఠీ)ని ఇలాగే దీవించానని, ఆమె వరుణ్ ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోయిందని అన్నారు.

"మృణాల్.. నీకు ఒక మాట చెప్పాలి. నువ్వు చాలా అద్భుతంగా నటిస్తున్నావు. నువ్వు మాకు కావాలి. నీ గ్లామర్, నీ యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. అందుకే నీకు నా తరఫున ఒక చిన్న సలహా.. నువ్వు ఎలాగైనా ఒక తెలుగు అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. అప్పుడు నువ్వు ఇక్కడే సెటిలైపోవచ్చు.. మా టాలీవుడ్ హీరోయిన్‌గా శాశ్వతంగా ఉండిపోవచ్చు" అని నవ్వుతూ అన్నారు.

మృణాల్ రియాక్షన్ ఇదే

ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అరవింద్ గారు కరెక్ట్‌గా చెప్పారు.. మృణాల్ మా తెలుగు కోడలు కావాల్సిందే!" అని కొందరు కామెంట్ చేస్తుంటే.. "ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మృణాల్‌కు జోడీ ఎవరు?" అంటూ నెటిజన్లు అప్పుడే మ్యాచెస్ వెతకడం మొదలుపెట్టేశారు.

మరి అల్లు అరవింద్ కోరిక మేరకు మృణాల్ నిజంగానే ఏదైనా తెలుగు సంబంధం చూసుకుంటుందా? లేక ఇది కేవలం ఒక సరదా సంభాషణగానే మిగిలిపోతుందా? అనేది చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అల్లు అరవింద్ మృణాల్ గురించి ఏమన్నారు?

మృణాల్ ఠాకూర్ ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లోనే సెటిలైపోవాలని, అప్పుడు ఆమె ఎప్పటికీ టాలీవుడ్ హీరోయిన్‌గానే ఉంటుందని అల్లు అరవింద్ సరదాగా వ్యాఖ్యానించారు.

2. మృణాల్ ఠాకూర్ నటించిన ఫేమస్ తెలుగు సినిమాలు ఏవి?

'సీతారామం' సినిమాతో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' వంటి సినిమాల్లో నటించింది.

3. అల్లు అరవింద్ ఎందుకు అలా అన్నారు?

మృణాల్ నటన, వ్యక్తిత్వం పట్ల అల్లు అరవింద్‌కు ఉన్న అభిమానంతో పాటు, ఆమె ఇక్కడే ఉంటే టాలీవుడ్‌కు ఒక మంచి నటి దొరుకుతుందనే ఉద్దేశంతో అలా అని ఉండవచ్చు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe