ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. అయితే ఈ ఏడాది వచ్చిన 'రాకా' (Raaka) మూవీ అనౌన్స్‌మెంట్ బన్నీ బర్త్‌డే ను మరింత స్పెషల్ గా మార్చింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ లుక్ పై రియాక్టయ్యాడు.
మాస్.. మాస్.. మాస్..

అట్లీ దర్శకత్వంలో 'జవాన్' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న షారుఖ్ ఖాన్, తాజాగా విడుదలైన 'రాకా' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్.. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అచ్చం నీలాగే అద్భుతంగా ఉంది. మీరిద్దరూ కలిసి ఏం మ్యాజిక్ చేశారో చూడాలని ఆత్రుతగా ఉంది. అట్లీ మాటల్లో చెప్పాలంటే.. ఈ అనుభవం 'మాస్.. మాస్.. మాస్' లా ఉండబోతోంది. రాకా చాలా ఎగ్జైటింగ్‌గా కనిపిస్తోంది. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్" అని షారుఖ్ రాసుకొచ్చారు.
రాకా ఫస్ట్ లుక్
అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ రాకాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ హైప్ మరింతగా పెరిగింది. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ముఖాన్ని తోడేలు లాంటి చేతితో దాచుకున్నట్లు కనిపించాడు. కళ్లకు కాటుక, గుండు, నెరిసిన గడ్డం, మీసాలతో అల్లు అర్జున్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
18 ఏళ్ల కల
{{/usCountry}}అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ రాకాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ హైప్ మరింతగా పెరిగింది. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ముఖాన్ని తోడేలు లాంటి చేతితో దాచుకున్నట్లు కనిపించాడు. కళ్లకు కాటుక, గుండు, నెరిసిన గడ్డం, మీసాలతో అల్లు అర్జున్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
18 ఏళ్ల కల
{{/usCountry}}దర్శకుడు అట్లీ రాకా సినిమా గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. "రాకా అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఇది నాలో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న ఒక భావం. గత 18 ఏళ్లుగా ఈ కథను, ఆలోచనను నా వెంటే ఉంచుకున్నాను. ఎప్పుడూ దీనిని మర్చిపోలేదు. ఈ ప్రయాణం నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని అట్లీ పేర్కొన్నాడు.
రిలీజ్ ఎప్పుడు?
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న రాకా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అట్లీతో షారుఖ్ చేసిన 'జవాన్' ఆయనకు ఉత్తమ నటుడిగా తొలి జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'రాకా' సినిమాకు దర్శకుడు ఎవరు?
జవాబు: ఈ చిత్రానికి కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్‌తో ఆయనకు మొదటి సినిమా.
ప్రశ్న: ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?
జవాబు: 'రాకా'లో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది.
ప్రశ్న: ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
జవాబు: ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2027లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.