Allu Arjun: క్రేజీ బజ్.. చిరంజీవి ఇంటి దగ్గరే అల్లు అర్జున్ కొత్త బంగ్లా.. ధర తెలిస్తే షాక్ అవాల్సిందే!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ క్రేజీ బజ్ తెగ వైరల్ గా మారింది. తన మామయ్య చిరంజీవి ఇంటి సమీపంలోనే అల్లు అర్జున్ కొత్త బంగ్లా కట్టిస్తున్నాడని తెలిసింది. దీని ధర తెలిస్తే షాక్ అవుతారు.
Allu Arjun: సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘రాకా’తో బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ తో ఐకాన్ స్టార్ బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ క్రేజీ బజ్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ కొత్త ఇల్లు
అల్లు అర్జున్ కొత్త ఇల్లు కట్టిస్తున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీహిల్స్ లో తన మామయ్య చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ కొత్త బంగ్లా నిర్మిస్తున్నారని తెలిసింది. రాజసం ఉట్టిపడేలా ఈ ఇంటికి అల్లు అర్జున్ ఎంతో ఇష్టంతో కట్టించుకుంటున్నారని టాక్. పైగా చిరంజీవి ఇంటికి సమీపంలోనే ఈ ఇల్లు నిర్మాణం జరుగుతుందనే విషయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
రేటు ఎంతంటే?
అల్లు అర్జున్ కొత్త ఇల్లు రేట్ తెలిస్తే షాక్ అవాల్సిందే. 4 వేల స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణంలో ఈ ఇల్లును నిర్మిస్తున్నారని తెలిసింది. దీని కోసం ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. భారీ డబ్బుతో విలాసవంతమైన బంగ్లాను తన కోసం అల్లు అర్జున్ కట్టించుకుంటున్నాడని టాక్.
రాకా గురించి
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న మూవీ ‘రాకా’. ఇదో సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
రాకా మూవీలో అల్లు అర్జున్ మూడు గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం. ఇందులో ఒకటేమో పోలీస్ క్యారెక్టర్ అని తెలిసిందే. మరొకటి సగం జంతువు, సగం మనిషిగా ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ లో కనిపించిన క్యారెక్టర్ అదే అని టాక్.
పుష్ప సినిమాలతో
పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలతో అల్లు అర్జున్ దశ తిరిగిపోయింది. ముఖ్యంగా పుష్ప 2తో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సక్సెస్ తో అల్లు అర్జున్ స్టార్ డమ్ ఆకాశాన్ని తాకేసింది. దీంతో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న రాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


