Allu Arjun: ఎవడన్నా నచ్చకపోతే వదిలేయండి.. మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.. ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ..: అల్లు అర్జున్

Allu Arjun: అల్లు అర్జున్ తన ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ ఓ కీలకమైన సూచన చేశాడు. ప్రతి ఏటా జరిగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో బన్నీ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jul 28, 2026, 16:22:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియా హేటర్స్, ఆన్‌లైన్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ శౌర్య భవన్‌లో జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ.. "ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ టైమ్ వేస్ట్ చేయకండి.. వదిలేయండి" అంటూ అభిమానులకు పవర్ ఫుల్ సందేశం ఇచ్చారు. బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో పాటు సినీ వర్గాల్లోనూ తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి.

Allu Arjun: ఎవడన్నా నచ్చకపోతే వదిలేయండి.. మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.. ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ..: అల్లు అర్జున్
Allu Arjun: ఎవడన్నా నచ్చకపోతే వదిలేయండి.. మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.. ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ..: అల్లు అర్జున్

బన్నీ నేర్పిన జీవిత పాఠం

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం జరిగే ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్ కల్చర్‌పై అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన జీవితాన్ని రోజువారీ 100 శాతం బ్యాటరీతో పోల్చిన అల్లు అర్జున్.. ఆ ఎనర్జీని ఎలా వాడుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.

"ఒక మనిషి లేదా ఒక విషయం నచ్చకపోతే దాని వెనుక పడి ద్వేషించడం, ట్రోల్స్ చేయడం దండగ. ఆ నెగెటివిటీ కోసం మీ వద్ద ఉన్న 100 శాతం ఎనర్జీలో ఒక్క శాతం కూడా వృథా చేయకూడదు" అని అల్లు అర్జున్ హితవు పలికారు. మీ లక్ష్యాలు, కుటుంబం, మీ కెరీర్, మీకు ఆనందాన్ని ఇచ్చే పనుల పైన మాత్రమే దృష్టి పెట్టాలని ఫ్యాన్స్‌కు సూచించారు.

మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నిల్చొన్నా సరే.. కనీసం మీకైనా ఆనందం దక్కుతుంది కదా అని బన్నీ అనడంతో ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున అరిచారు.

షూ విప్పి.. దేవుడి విగ్రహం తీసుకొని..

ఇదే ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన మరో పని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని ఆయనకు పూరి జగన్నాథ విగ్రహాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దీంతో బన్నీ తన షూస్ విప్పి ఆ విగ్రహాన్ని అందుకున్నారు. ఇది ఆయన భక్తికి నిదర్శనం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'రాకా' మూవీ మానియా.. అట్లీ మార్క్ విజువల్ వండర్

ఫ్యాన్స్ మీట్‌లో మాట్లాడిన బన్నీ వ్యాఖ్యలతో పాటు ఆయన నెక్స్ట్ రాబోతున్న పాన్-వరల్డ్ మూవీ 'రాకా' (Raaka) హ్యాష్‌ట్యాగ్ కూడా నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ఈ ఫ్యాన్స్ మీట్ లో అర్జున్.. తన ఐకానిక్ రాకా పోజు ఇవ్వడం విశేషం.

'పుష్ప 2' నెక్స్ట్ లెవెల్ గ్లోబల్ సక్సెస్ తర్వాత బన్నీ నుంచి రాబోతున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మార్క్ గ్రాండియర్, పవర్‌ఫుల్ విజువల్స్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్‌గా ఉండబోతున్నాయని టాక్.

లోకేష్ కనగరాజ్‌తో 'AA23'.. అనిరుధ్ మ్యూజిక్

'రాకా' షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్న అల్లు అర్జున్, ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో 'AA23' ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పక్కా రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ రెండు బిగ్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ దగ్గర బన్నీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

'కీప్ ది ఫైర్ ఆన్'.. ఫ్యాన్స్ హర్షం

హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది అభిమానులను ఉద్దేశించి "మీరంతా నా హృదయంలో ఉన్నారు.. కీప్ ది ఫైర్ ఆన్" అంటూ బన్నీ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ కామెంట్స్ కేవలం ట్రోలర్స్‌కు క్లాస్ పీకడం మాత్రమే కాదని, జీవితంలో సొంత లక్ష్య సాధన కోసం ముందుకెళ్లేందుకు బన్నీ ఇచ్చిన గొప్ప లైఫ్ మెసేజ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More