Allu Aravind: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‘సంధ్య’ థియేటర్ వద్ద ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షో సమయంలో జరిగిన విషాద ఘటన మరువలేనిది. 2024 డిసెంబర్‌లో జరిగిన ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై నెలల తరబడి ప్రాణాపాయ స్థితిలో పోరాడారు.

ఈ కేసులో అప్పట్లో అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటను నిలబెట్టుకుంటూ తాజాగా అల్లు కుటుంబ సభ్యులు బాధితులను కలుసుకున్నారు.
బాధితులకు భరోసా ఇచ్చిన అల్లు అరవింద్, స్నేహారెడ్డి
బుధవారం (మే 6) అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి.. రేవతి కుటుంబాన్ని వారి నివాసంలో సందర్శించారు. రేవతి భర్త భాస్కర్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రేవతి కుమార్తె సాన్వితో అల్లు అరవింద్ ప్రత్యేకంగా ముచ్చటించారు.
"నువ్వు బాగా చదువుకుంటావా? తప్పకుండా చదువుకోవాలి. నీ చదువుకు అయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తాను" అని అల్లు అరవింద్ ఆ చిన్నారికి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోలుకుంటున్న శ్రీతేజ్.. అందని సాయం?
ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ సుమారు ఐదు నెలల పాటు వెెంటిలేటర్ పైనే ఉన్నాడు. ఏప్రిల్ 2025లో డిశ్చార్జ్ అయినప్పటికీ.. అతనికి ఇంకా దీర్ఘకాలిక వైద్య చికిత్స అవసరమవుతోంది. అయితే గతేడాది డిసెంబర్‌లో భాస్కర్ మీడియా ముందుకు వచ్చి తనకు ప్రభుత్వం, చిత్ర యూనిట్ నుంచి రావాల్సిన రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందలేదని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) చైర్మన్ దిల్ రాజు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారమైందని ప్రకటించారు. అల్లు కుటుంబం నేరుగా ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలేం జరిగింది?
{{/usCountry}}ఆ తర్వాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) చైర్మన్ దిల్ రాజు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారమైందని ప్రకటించారు. అల్లు కుటుంబం నేరుగా ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలేం జరిగింది?
{{/usCountry}}డిసెంబర్ 4, 2024న 'పుష్ప 2' ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి సంధ్య థియేటర్‌కు వచ్చారు. ఆయన్ని చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో రేవతి మృతి చెందగా, పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 13న బన్నీ అరెస్టవ్వగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజే విడుదలయ్యారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం 'రాకా' (Raaka) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్,సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో బన్నీ సినిమాలు చేయనున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సంధ్య థియేటర్ ఘటన ఎప్పుడు జరిగింది?
డిసెంబర్ 4, 2024న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో అల్లు అర్జున్‌ను చూడటానికి అభిమానులు ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.
2. అల్లు అరవింద్ బాధితులకు ఎలాంటి హామీ ఇచ్చారు?
మృతురాలు రేవతి కుమార్తె సాన్వి విద్య కోసం అయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు.
3. బాధితుడు శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఏప్రిల్ 2025లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు, అయితే ఇంకా మెడికల్ కేర్ అవసరమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
4. అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు?
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయిక.