"ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాలూకా".. ఆటోపై రాత చూసి మురిసిపోయిన స్నేహారెడ్డి.. వైరల్ అవుతున్న ఫోటో

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తన భర్త పేరును ఓ ఆటోపై చూసి తెగ మురిసిపోతోంది. ఈ ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్ లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ విశేషాలేంటో చూడండి.

Feb 16, 2026, 13:43:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లు అర్జున్, స్నేహారెడ్డిల ప్రేమబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్ళై 15 ఏళ్లు గడుస్తున్నా వీరిద్దరి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒక ఆటో వెనుక తన భర్త పేరును చూసి ఆమె మురిసిపోయింది. ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఆ ఫొటోను షేర్ చేసింది.

"ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాలూకా".. ఆటోపై రాత చూసి మురిసిపోయిన స్నేహారెడ్డి.. వైరల్ అవుతున్న ఫోటో
"ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాలూకా".. ఆటోపై రాత చూసి మురిసిపోయిన స్నేహారెడ్డి.. వైరల్ అవుతున్న ఫోటో

అల్లు అర్జున్ తాలూకా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన భర్త, పిల్లలకు సంబంధించిన క్యూట్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే తర్వాత హైదరాబాద్ రోడ్లపై వెళ్తుండగా ఆమెకు ఒక ఆటో కనిపించింది. ఆ ఆటో వెనుక "ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాలూకా" అని ఇంగ్లిష్ అక్షరాల్లో రాసి ఉండటాన్ని ఆమె గమనించింది.

వెంటనే ఆ ఆటోను ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీనికి ఆమె ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోయినా, బన్నీ పట్ల అభిమానుల ప్రేమను చూసి ఆమె గర్వపడిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ "ఎంత ముచ్చటగా ఉంది", "వదినమ్మ ఫుల్ ఖుషీ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "నా భర్త.. నా భర్త అని చెప్పుకోవడంలో స్నేహారెడ్డి, సుప్రియా మీనన్ (పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య) మాత్రమే బెస్ట్" అని కొందరు సరదాగా పోస్టులు పెడుతున్నారు.

అల్లు కపుల్.. 15 ఏళ్ల ప్రయాణం

అల్లు అర్జున్, స్నేహారెడ్డి 2011 మార్చి 6న ఘనంగా వివాహం చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ తమ 15వ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోబోతున్నారు. వీరికి అయాన్ (2014), అర్హ (2016) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక ఫ్రెండ్ పెళ్లిలో కలుసుకున్న వీరిద్దరూ, కొన్నాళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

"నాది వన్ సైడ్ లవ్.."

2024లో జరిగిన 'ఆర్య' 20 ఏళ్ల వేడుకలో బన్నీ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. తన వన్ సైడ్ లవ్ గురించి చెప్పమని అడిగినప్పుడు.. "నా లైఫ్ టైమ్ వన్ సైడ్ లవ్ స్నేహాతోనే (నవ్వుతూ). నేను ప్రేమించడమే తప్ప, అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదు" అని స్నేహా ముందే బన్నీ జోక్ చేశాడు.

ఇక అల్లు అర్జున్ కెరీర్ చూస్తే.. 'పుష్ప: ది రూల్' సినిమాతో బన్నీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ సినిమా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం అతడు అట్లీ (Atlee) దర్శకత్వంలో రాబోయే భారీ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటించనుంది. జాన్వీ కపూర్ ను కూడా తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నాడు.

అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More