జపాన్‌లోనూ పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులు.. టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చోటు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ సరిహద్దులు దాటి జపాన్‌లోనూ సత్తా చాటుతోంది. అక్కడ 'పుష్ప కున్రిన్' పేరుతో విడుదలైన 'పుష్ప 2' మూవీ.. తాజాగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో టాప్-10లో చేరింది. ఆమిర్ ఖాన్ 'ధూమ్ 3' రికార్డును బద్దలు కొట్టింది.
ఇండియాలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సుకుమార్ - అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’.. ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ వద్ద కూడా తన మార్కును చూపిస్తోంది. ఈ ఏడాది జనవరి 16న జపాన్‌లో 'పుష్ప కున్రిన్' (Pushpa Kunrin) పేరుతో విడుదలైన ఈ మూవీ.. మొదట్లో నెమ్మదిగా ప్రారంభమైనా, మౌత్ టాక్ అద్భుతంగా ఉండటంతో పుంజుకుంది. ఫలితంగా జపాన్ గడ్డపై అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాల లిస్టులో చేరిపోయింది.

14 రోజుల్లోనే రికార్డు బ్రేక్..
ట్రేడ్ వర్గాల (Sacnilk) నివేదిక ప్రకారం.. విడుదలైన 14 రోజుల్లోనే 'పుష్ప 2' జపాన్‌లో 105 మిలియన్ యెన్‌లు (సుమారు రూ. 6.06 కోట్లు) వసూలు చేసింది. తద్వారా ఆమిర్ ఖాన్ నటించిన 'ధూమ్ 3' (104.5 మిలియన్ యెన్‌లు) లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించి, 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది. టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని సమాచారం.
నెక్స్ట్ టార్గెట్ రజినీకాంత్ 'రోబో'
ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్న పుష్ప 2.. త్వరలోనే 9వ స్థానానికి చేరే అవకాశం ఉంది. 9వ స్థానంలో రజనీకాంత్ నటించిన 'రోబో' (109.6 మిలియన్ యెన్‌లు) ఉంది. మరో నాలుగున్నర మిలియన్ యెన్‌లు వసూలు చేస్తే బన్నీ ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తారు.
టాప్ ప్లేస్ మాత్రం కష్టమే..
జపాన్‌లో ఇండియన్ సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' (RRR) తిరుగులేని ఆధిక్యంలో ఉంది. ఏకంగా 2.42 బిలియన్ యెన్‌లు (సుమారు రూ. 139 కోట్లు) వసూలు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ముత్తు, బాహుబలి 2, 3 ఇడియట్స్, ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పుష్ప 2 టాప్ ప్లేస్‌కు వెళ్లడం అసాధ్యమే అయినా, టాప్-10లో చోటు దక్కించుకోవడం గొప్ప విషయమే. ఇక ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప 2' తన రన్ ముగిసే సమయానికి రూ. 1871 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.
| సినిమా పేరు | జపాన్ బాక్సాఫీస్ (జపాన్ కరెన్సీ యెన్) |
|---|---|
| ఆర్ఆర్ఆర్ | ¥ 2.42 బిలియన్ ( ₹139.73 కోట్లు) |
| ముత్తు | ¥ 405 మిలియన్ ( ₹23.39 కోట్లు) |
| బాహుబలి 2 | ¥ 305 మిలియన్ ( ₹17.61 కోట్లు) |
| 3 ఇడియట్స్ | ¥ 170 మిలియన్ ( ₹9.81 కోట్లు) |
| ఇంగ్లిష్ వింగ్లిష్ | ¥ 160 మిలియన్ ( ₹9.24 కోట్లు) |
| ది లంచ్ బాక్స్ | ¥ 150 మిలియన్ ( ₹8.66 కోట్లు) |
| సాహో | ¥ 131 మిలియన్ ( ₹7.56 కోట్లు) |
| మగధీర | ¥ 130.1 మిలియన్ ( ₹7.51 కోట్లు) |
| రోబో | ¥ 109.6 మిలియన్ ( ₹6.33 కోట్లు) |
| పుష్ప 2 | ¥ 105 మిలియన్ ( ₹6.06 కోట్లు) |
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


