Allu Arjun: పీఎం మోదీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అల్లు అర్జున్ 'AA23' థీమ్.. లైక్ కొట్టిన ఐకాన్ స్టార్.. పవన్ భార్య కూడా..

Allu Arjun: ప్రధాని నరేంద్ర మోదీ తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఒక పెద్ద సంచలనంగా మారింది. మోదీ తన పోస్ట్ బ్యాక్‌గ్రౌండ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  రాబోయే సినిమా 'AA23' థీమ్ సాంగ్ వాడటం.. దానికి బన్నీ లైక్ కొట్టడం వైరల్ అవుతోంది.

Published on: Jun 17, 2026, 16:12:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Allu Arjun: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులు ఎప్పుడూ చాలా పవర్‌ఫుల్ గా ఉంటాయి. కానీ తాజాగా ఆయన చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా బ్రాటిస్లావాలో జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రధానికి అత్యున్నత పురస్కారమైన 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' (1st Class) లభించింది.

Allu Arjun: పీఎం మోదీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అల్లు అర్జున్ 'AA23' థీమ్.. లైక్ కొట్టిన ఐకాన్ స్టార్.. పవన్ భార్య కూడా.. (Instagram/AP)
Allu Arjun: పీఎం మోదీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అల్లు అర్జున్ 'AA23' థీమ్.. లైక్ కొట్టిన ఐకాన్ స్టార్.. పవన్ భార్య కూడా.. (Instagram/AP)

ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంటున్న ఫోటోను మోదీ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ కు ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా 'AA23' థీమ్ సాంగ్ వాడటం తెలిసిందే. దీనికి బన్నీ రియాక్ట్ అవడమే ఇప్పుడు హైలైట్.

Allu Arjun Reacts to PM's Post | మోదీ పోస్ట్ కు అల్లు అర్జున్ లైక్

ఈ క్రేజీ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్వయంగా స్పందించారు. పీఎం మోదీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ను బన్నీ లైక్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, బాలీవుడ్ సెలబ్రిటీ రిద్ధిమా కపూర్ కూడా ఈ పోస్ట్ ను లైక్ చేశారు.

ప్రధాని మోదీ తమ ఫేవరెట్ స్టార్ సినిమా సాంగ్ వాడటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో హంగామా సృష్టిస్తున్నారు. "జీటీఏ 6 (GTA VI) గేమ్ రాకముందే మోదీజీ అనిరుధ్ కంపోజ్ చేసిన మా బన్నీ అన్న సాంగ్ వాడటం చూశాం" అంటూ కొందరు.. "మా భాయ్ (bhAAi) సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవుతోంది.. భాయ్ ఈజ్ ఎవ్రీవేర్" అంటూ మేజర్ జీఐఎఫ్ (GIFs) లతో అల్లు ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ ను స్పామ్ చేస్తున్నారు.

About AA 23 | లోకేష్ - బన్నీ ల గ్లోబల్ ప్రాజెక్ట్

ఈ ఏడాది జనవరిలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. "ఇండియన్ చలనచిత్ర చరిత్రలోనే ఇదొక ఎటర్నల్ కాంబినేషన్.. స్ట్రైవ్ ఫర్ గ్రేట్‌నెస్" అంటూ రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ ప్రోమో వీడియోలోని '23 థీమ్' సాంగ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో సంచలనం సృష్టించింది. ఈ పాటను మిస్టరీ లిరిసిస్ట్ హైసెన్‌బర్గ్ రాయగా, హెక్టర్ సలామాంకా పాడారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో పాటు అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. 'పుష్ప: ది రైజ్' (2021), 'పుష్ప 2: ది రూల్' (2024) బ్లాక్‌బస్టర్ల కోసం సుకుమార్ తో ఐదేళ్లు ట్రావెల్ చేసిన బన్నీ.. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో 'రాకా' (Raaka) అనే భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది.

హెచ్‌టీ విశ్లేషణ

ఒక ప్రాంతీయ సినిమా థీమ్ మ్యూజిక్ ను దేశ ప్రధాని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో వాడటం అనేది ఆ ప్రాజెక్ట్ రేంజ్ ను నేషనల్ లెవెల్ లో ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. ‘పుష్ప 2’తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాసింగ్ వసూళ్లు సాధించిన అల్లు అర్జున్ కు ఉన్న గ్లోబల్ క్రేజ్ కు ఇది ఒక నిదర్శనం. అనిరుధ్ మ్యూజిక్ రీల్స్ లో ఆల్రెడీ వైరల్ అవుతుండగా, ప్రధాని పోస్ట్ తో దీనికి మరింత విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.

అల్లు అర్జున్ లైక్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్
అల్లు అర్జున్ లైక్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More