Modi AA23 Theme: ప్రధాని మోదీ ఇన్‌స్టా పోస్ట్‌లో అల్లు అర్జున్ 'AA23' థీమ్.. గ్లోబల్ వేదికపై అనిరుధ్ మ్యూజిక్ సెన్సేషన్
Modi AA23 Theme: అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ AA23. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సినిమా థీమ్ మ్యూజిక్‌ను ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఇన్‌స్టా రీల్‌లో ఉపయోగించారు.
Modi AA23 Theme: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ AA23 అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సంచలనం సృష్టించింది.

ఈ సినిమా కోసం అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్లకు పైగా రీల్స్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే ఈ క్రేజీ థీమ్ మ్యూజిక్‌కు ఊహించని విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అరుదైన గౌరవం దక్కింది.
మోదీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో AA23 మ్యూజిక్ హోరు
ఇటీవల స్లోవేకియా పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా స్లోవేకియా ప్రెసిడెంట్ పీటర్ పెల్లెగ్రినితో కలిసి దిగిన విజువల్స్‌ను పీఎం మోదీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ హై ప్రొఫైల్ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా అల్లు అర్జున్ AA23 థీమ్ మ్యూజిక్‌ను వాడారు. 140 కోట్ల జనాభా గల దేశ ప్రధాని ఒక అంతర్జాతీయ వేదిక వీడియోకు బన్నీ సినిమా సాంగ్ ఉపయోగించడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో "ఐకాన్ స్టార్ రేంజ్ ఇదీ" అంటూ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ సినిమా లేట్ కానుందా?
ఈ గ్లోబల్ బజ్ మధ్యే అల్లు అర్జున్ అభిమానులకు ఒక షాకింగ్ అప్‌డేట్ కూడా వినిపిస్తోంది. AA23 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పూర్తి ఫోకస్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ 'రాకా' (Raaka) పైన పెట్టారు.
దీపికా పదుకోన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ లేదా యాక్షన్ డ్రామా షూటింగ్ 2026 చివరి వరకు సాగనున్నట్లు తెలుస్తోంది. టాప్ హాలీవుడ్ స్టూడియోస్ దీని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వర్క్ బాధ్యతలు తీసుకోనున్నాయి. కాబట్టి 'రాకా' సినిమాను డిసెంబర్ 2027 క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అప్పటివరకు వేచి చూడాల్సిందే
అట్లీ సినిమా 'రాకా' కంప్లీట్ అయిన తర్వాతే లోకేష్ కనగరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అప్పటివరకు లోకేష్ కనగరాజ్ తన ఇతర LCU (Lokesh Cinematic Universe) ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉంటారు. రాబోయే నెలల్లో AA23 కి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు, నటీనటుల వివరాలను మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


