అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అని మొదట్లో అన్నారు. కానీ అది కాస్త జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో వెళ్లిపోయినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే ప్రాజెక్ట్ బన్నీ దగ్గరికే వచ్చిందని అంటున్నారు. ఈ ఇండస్ట్రీ టాక్ పై ప్రముఖ ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు స్పందించాడు.
బన్నీ వాసు ఏమన్నాడంటే?

అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఏంటి? త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేస్తున్నాడా లేదా? అతని భవిష్యత్తు ప్రాజెక్టులు ఏంటి అన్న ప్రశ్నలకు ప్రొడ్యూసర్ బన్నీ వాసు సమాధానమిచ్చాడు. ఈషా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అతడు మాట్లాడాడు. అయితే ఇలాంటి వాటిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని అతడు చెప్పాడు.
“ఇండస్ట్రీలో ప్రాజెక్టులు అటుఇటూ కావడం జరుగుతుంటాయి. హీరోలు, డైరెక్టర్లు, మాకు అందరికీ మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇలాంటి విషయాలు ఫ్యాన్స్ మధ్య యుద్ధానికి దారి తీయకుండా ఉండటానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందుకే వీటిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి” అని బన్నీ వాసు అన్నాడు. అల్లు అర్జున్ చేతికి త్రివిక్రమ్ సినిమా తిరిగి వచ్చిందా అని ప్రశ్నించినప్పుడు అతడు ఇలా స్పందించాడు.
అల్లు అర్జున్ చేతిలో రెండు ప్రాజెక్టులు
ఇక అల్లు అర్జున్ తర్వాతి రెండు ప్రాజెక్టులపై తమకు క్లారిటీ ఉందని కూడా బన్నీ వాసు తెలిపాడు. “అల్లు అర్జున్ చేతుల్లో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒకదానిపై జనవరిలో అనౌన్స్ మెంట్ ఉంటుంది. వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రాజెక్టు మొదలవుతుంది. ఇక మరొకటి 2027 మార్చిలో ఉండబోతోంది” అని బన్నీ వాసు స్పష్టం చేశాడు.
పుష్ప 2 తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకోన్ ఫిమేల్ లీడ్ గా ఉంది. దీంతోపాటు అతడు లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగాలతోనూ మూవీస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్టార్ డైరెక్టర్లతో మూవీస్ బన్నీ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
{{/usCountry}}పుష్ప 2 తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకోన్ ఫిమేల్ లీడ్ గా ఉంది. దీంతోపాటు అతడు లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగాలతోనూ మూవీస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్టార్ డైరెక్టర్లతో మూవీస్ బన్నీ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
{{/usCountry}}