అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి ముద్దుల కూతురు అల్లు అర్హ 9 ఏళ్ల పూర్తి చేసుకొని పదో ఏట అడుగుపెట్టింది. అయితే ఆమె బర్త్ డే వేడుకలు ఇండియాలో కాకుండా దుబాయ్‌లో జరగడం విశేషం. ఈ ఫొటోలను స్నేహ ఇన్‌స్టాగ్రామ్ లో సోమవారం (నవంబర్ 24) షేర్ చేయగా.. అవి వైరల్ గా మారాయి.
అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆమె పుట్టిన రోజు వేడుకల కోసం ఫ్యామిలీ దుబాయ్ వెళ్లడం విశేషం. ఈ ఫొటోలు, వీడియోలను స్నేహ షేర్ చేసింది. “తొమ్మిది సంవత్సరాల గ్రేస్, స్వీట్‌నెస్, అత్యంత మ్యాజికల్ ఆరా.. వాటర్ ఫన్, కేకులు, మాల్ షాపింగ్ - నిన్ను సెలబ్రేట్ చేసుకోవడం స్వచ్ఛమైన ఆనందం. మై బేబీ గర్ల్.. నువ్వు ప్రతి క్షణాన్ని మెరిసేలా చేస్తావు” అనే క్యాప్షన్ తో స్నేహ ఈ స్పెషల్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంది.
అల్లు అర్జున్ కోసం..
అయితే ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ చివరి స్లైడ్ వరకూ వెతుకుతూ వెళ్లినట్లు కామెంట్స్ చేశారు. బన్నీ మాత్రం చివరి స్లైడ్ లో ఓ వీడియోలో పిల్లలతో కలిసి ఓ మాల్ లో నడుచుకుంటూ వెళ్లడం చూడొచ్చు. అది కూడా వెనుక నుంచి ఉంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి మాట్లాడుతూ బన్నీ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక దుబాయ్ లో కొన్ని రోజులు అల్లు ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేసిందీ ఈ పోస్టులో చూడొచ్చు. అర్హ కోసం స్పెషల్ కేకులు, అందంగా డెకొరేట్ చేసిన రూమ్స్, స్విమ్మింగ్ పూల్‌లో సరదా క్షణాలు వీటిలో కనిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం అట్లీతో కలిసి ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో దీపికా పదుకోన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ బర్త్ డే పోస్టుపై ఓ అభిమాని స్పందిస్తూ.. నీకు ఎన్ని చాక్లెట్లు కావాలన్నా ఇస్తాను.. మీ డాడీ ఫోన్ లో ఏమైనా సినిమా అప్డేట్స్ ఉంటే పంపించు అని అర్హకు ఆఫర్ ఇవ్వడం విశేషం.
{{/usCountry}}అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం అట్లీతో కలిసి ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో దీపికా పదుకోన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ బర్త్ డే పోస్టుపై ఓ అభిమాని స్పందిస్తూ.. నీకు ఎన్ని చాక్లెట్లు కావాలన్నా ఇస్తాను.. మీ డాడీ ఫోన్ లో ఏమైనా సినిమా అప్డేట్స్ ఉంటే పంపించు అని అర్హకు ఆఫర్ ఇవ్వడం విశేషం.
{{/usCountry}}