Allu Sirish: కాఫీ షాప్‌లో ప్రేయ‌సితో రెడ్ హ్యాండెడ్‌గా- చిరంజీవి భార్య‌కు ఫోన్‌- ల‌వ్‌ స్టోరీ, హ‌నీమూన్‌పై అల్లు శిరీష్‌

Allu Sirish: ప్రియురాలు నయనిక రెడ్డిని అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ తిరిగి తమ వర్క్ లైఫ్ లో బిజీ అయిపోయారు. అయితే తాజాగా  హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీ, భార్యపై ప్రేమ, హనీమూన్ ప్లాన్స్ గురించి అల్లు శిరీష్ తెలిపాడు. 

Published on: Mar 13, 2026, 09:01:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రీసెంట్ గా అల్లు శిరీష్ ఓ ఇంటివాడయ్యాడు. మార్చి 6న హైదరాబాద్ లో జరిగిన పెళ్లిలో తన ప్రియురాలు నయనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి తర్వాత ఈ జంట తమ వర్క్ లైఫ్ లో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, హనీమూన్ ప్లాన్స్ గురించి శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

అల్లు శిరీష్, నయనిక రెడ్డి
అల్లు శిరీష్, నయనిక రెడ్డి

అల్లు శిరీష్ లవ్ స్టోరీ

నయనికను ఓ పార్టీలో అల్లు శిరీష్ కలిశాడు. హీరో నితిన్ భార్య శాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్. 2023లో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కోసం నితిన్, శాలిని ఓ పార్టీ అరెంజ్ చేశారు. ఈ పార్టీలోనే నయనికను ఫస్ట్ టైమ్ కలిసినట్లు శిరీష్ తెలిపాడు.

పెళ్లి గురించే

“మేము డేటింగ్ ప్రారంభించినప్పటి నుంచి పెళ్లి గురించే మాట్లాడుకున్నాం. వెడ్డింగ్ చేసుకుంటామనే అనుకున్నాం. అలాగే మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నాం’’ అని అల్లు శిరీష్ చెప్పాడు.

సెన్స్ ఆఫ్ హ్యూమర్

‘‘నయనిక సెన్సాఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఏ విషయాన్ని అయినా డైరెక్ట్ గా చెప్పేస్తుంది. ఏదైనా బాలేదనిపిస్తే బాలేదని అంటుంది. నా జీవితంలోని ఏ విషయమైనా ఆమెతో షేర్ చేసుకుంటా. నా సినిమాల గురించి కూడా ఆమె ఉన్నది ఉన్నట్లు చెప్తుంది’’ అని శిరీష్ పేర్కొన్నాడు.

అత్తకు ఫోన్

ఒకసారి నయనికతో కలిసి తాను కాఫీ షాప్ కు వెళ్లిన విషయం మేనత్త సురేఖ (చిరంజీవి భార్య)కు తెలిసిందని అల్లు శిరీష్ వెల్లడించాడు. “మేము ఒకసారి కాఫీ షాప్‌కు వెళ్లాం. ఆ విషయం బయటకు తెలిసింది. అమెరికాలోని మా రిలేటివ్స్ అత్త సురేఖకు ఫోన్ చేసి మా విషయం అడిగారు. స్నేహ (అన్న అల్లు అర్జున్ భార్య), నిహారిక (నయనిక సిస్టర్) మంచి ఫ్రెండ్స్, దీంతో మా విషయం అందరికీ తెలిసిపోయింది’’ అని అల్లు శిరీష్ తెలిపాడు.

హనీమూన్ ప్లాన్స్

నయనిక తండ్రి చనిపోయాడు. తన దివంగత మామ లాగే నయనికను ఎంతో ప్రేమగా చూసుకుంటానని అల్లు శిరీష్ పేర్కొన్నాడు. నయనికకు రక్షణగా నిలిచే భర్తగా ఉంటానని శిరీష్ అన్నాడు. ఇక హనీమూన్ ప్లాన్స్ గురించి కూడా శిరీష్ మాట్లాడాడు.

‘‘“మేము మా అపార్ట్‌మెంట్‌ను రెడీ చేసుకుంటున్నాం. నయనిక తిరిగి వర్క్ స్టార్ట్ చేసింది. నేను కూడా బిజీ అయిపోయా. అల్లు సినిమాస్ కూడా ఓపెన్ అయింది. మేం ఇద్దరం కంప్లీట్ చేయాల్సిన పెండింగ్ పనులు ఉన్నాయి. అవి పూర్తి అయ్యాక హనీమూన్ కు వెళ్తాం’’ అని అల్లు శిరీష్ చెప్పాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More