క్రైమ్ థ్రిల్లర్ల మూవీస్, వెబ్ సిరీస్ లలో సాధారణంగా "హంతకుడు ఎవరు?" అనే ఉత్కంఠ చివరి వరకు ఉంటుంది. కానీ సురేష్ త్రివేణి రూపొందించిన ‘దల్దల్’ వెబ్ సిరీస్‌లో రెండో ఎపిసోడ్‌లోనే కిల్లర్ ఎవరో, హత్యలు ఎలా చేస్తున్నారో చూపించేస్తారు. అయినా సరే ఈ సిరీస్ ఆసక్తిని కోల్పోదు. ఇది హంతకుడు ఎవరనే దానికంటే, సాధారణ మనుషులు హంతకులుగా ఎందుకు మారారనే కోణంలో సాగే కథ. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
దల్దల్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?

కొత్తగా నియమితులైన డీసీపీ రీటా ఫెరీరా (భూమి పెడ్నేకర్) ఒక సీరియల్ కిల్లర్ కేసును ఛేదించాల్సి వస్తుంది. హంతకుడు బాధితుల మణికట్టు కోసి చంపుతుంటాడు. రీటా తన వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాలతో, వ్యసనాలతో పోరాడుతూనే ఈ కేసును డీల్ చేస్తుంది.
మరోవైపు అనిత (సమారా తిజోరి), సాజిద్ (ఆదిత్య రావల్) అనే జంట తమకు అన్యాయం చేశారని భావించేవారిని శిక్షిస్తుంటారు. అనిత గతం కూడా రీటా గతానికి దగ్గరగా ఉంటుంది. వీరిద్దరి ప్రయాణం, వాళ్లు ఎంచుకున్న మార్గాలు వారిని ఎలా మార్చాయన్నదే ఈ వెబ్ సిరీస్ కథ.
దల్దల్ వెబ్ సిరీస్‌లో ఏం బాగుందంటే?
ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ప్రధానంగా నిలబెట్టింది ముగ్గురు ప్రధాన నటులే. భూమి పెడ్నేకర్ కోపంతో ఊగిపోయే పోలీస్ అధికారిగా కాకుండా, మానసిక సంఘర్షణ అనుభవించే పాత్రలో ఒదిగిపోయింది. కిల్లర్‌గా ఆదిత్య రావల్ తన నటనతో ఆకట్టుకున్నాడు.
అయితే అందరికంటే ఎక్కువగా ఆకట్టుకునేది సమారా తిజోరి. ఒక సైకో కిల్లర్‌గా ఆమె నటన అద్భుతం. అతిగా అరవడం, గట్టిగా డైలాగులు చెప్పడం కాకుండా.. కేవలం తన కళ్ళతోనే లోపల ఉన్న తన ఆగ్రహాన్ని చూపించింది.
రీటా, అనిత పాత్రలను ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలుగా చూపించడం బాగుంది. ఇద్దరి గతం ఒకేలా ఉన్నా.. వారికి దొరికిన ప్రేమ, వారు పెరిగిన పరిస్థితులు వారిని ఎలా భిన్నంగా మార్చాయో బాగా చూపించారు.
దల్దల్ మైనస్ పాయింట్లు
{{/usCountry}}రీటా, అనిత పాత్రలను ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలుగా చూపించడం బాగుంది. ఇద్దరి గతం ఒకేలా ఉన్నా.. వారికి దొరికిన ప్రేమ, వారు పెరిగిన పరిస్థితులు వారిని ఎలా భిన్నంగా మార్చాయో బాగా చూపించారు.
దల్దల్ మైనస్ పాయింట్లు
{{/usCountry}}క్రైమ్ థ్రిల్లర్లకు ప్రధానంగా థ్రిల్ అనేది చాలా ముఖ్యం. కానీ ఇందులో అదే మిస్సయింది. హంతకుల మానసిక స్థితిని, నేరాలకు గల కారణాలను విశ్లేషించే క్రమంలో.. అసలైన మర్డర్ మిస్టరీ థ్రిల్‌ను పక్కన పెట్టేశారు. కొన్ని చోట్ల కథనం దారి తప్పినట్లు అనిపిస్తుంది. సిరీస్ మొత్తం మరీ సీరియస్‌గా, బాధాకరంగా ఉండటం కొందరికి నచ్చకపోవచ్చు.
కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అద్భుతమైన క్లైమాక్స్ ఈ వెబ్ సిరీస్‌ను కాపాడింది. ఇది పర్ఫెక్ట్ షో కాకపోయినా ఈ ఏడాది హిందీ ఓటీటీలో వచ్చిన ఒక మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వీకెండ్ చూసేయొచ్చు.