OTT Crime Thriller: క్రూరంగా చంపే సీరియల్ కిల్లర్-యంగ్ డీసీపీగా భూమి పెడ్నేకర్-ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
క్రూరంగా హత్యలు చేసే సీరియల్ కిల్లర్ ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ స్టోరీతో ఓ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది.
ఓటీటీలో ఈ రోజు (జనవరి 30) కొత్త సినిమాలు, కొత్త సిరీస్ ల జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అదిరిపోయే సస్పెన్స్, ట్విస్ట్ లతో ఓ కొత్త వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరెక్కిన ఈ సిరీస్ పేరు దల్‌దల్. ఇందులో భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ గా నటించింది.

దల్‌దల్ ఓటీటీ
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ రకం సినిమాలు, సిరీస్ లను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన దల్‌దల్ వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. ఇది సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది రిలీజైంది. ఓటీటీలో ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది.
దల్‌దల్ అంటే
వెబ్ సిరీస్ పేరు దల్‌దల్. ఇది డిఫరెంట్ గా ఉంది. దీని అర్థం ఊబి. ఊబిలో చిక్కుకుంటే ఎలా కిందకు వెళ్లిపోతామో ఈ వెబ్ సిరీస్ లో నేరస్థులను పట్టుకునే క్రమంలో హీరోయిన్ కూడా అలాంటి ఊబిలో చిక్కుకుంటుందని అర్థం. అందుకే ఈ సిరీస్ కు దల్‌దల్ అనే పేరు పెట్టారు. ఇందులో భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా నటించింది.
7 ఎపిసోడ్లు
దల్‌దల్ వెబ్ సిరీస్ సీజన్ 1లో 7 ఎపిసోడ్లు ఇవాళ ఒక్కసారే స్ట్రీమింగ్ కు వచ్చాయి. హిందీలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళంలో కూడా అందుబాటులో ఉంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో భూమి పెడ్నేకర్, శాశ్వత్ ఛటర్జీ తదితరులు నటించారు. దీనికి అమృత్ రాజ్ చోప్రా డైరెక్టర్. ఈ సిరీస్‌ను విక్రమ్ మల్హోత్రా తన సొంత బ్యానర్ అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ పై నిర్మించాడు.
దల్‌దల్ స్టోరీ
ముంబయి సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఇవి కాస్త వింతగా ఉంటాయి. ఈ సీరియల్ కిల్లర్ హత్యలు చేయడంతో పాటు కొన్ని ఆధారాలను కూడా వదిలిపెట్టి వెళ్తాడు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు యంగ్ డీసీపీ రీటా ఫెరీరా (భూమి పెడ్నేకర్) రంగంలోకి దిగుతుంది.
సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు రిటా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. అయితే ఈ క్రమంలో ఈ హత్యలకు, తన గతానికి ఏదో సంబంధం ఉందని తెలుస్తుంది. అంతే కాకుండా రీటాను తన తండ్రి మరణం, గతంలోని చేదు జ్ఞాపకాలు వెంటాడుతాయి. వీటి కారణంగా రీటా ఆందోళన చెందుతుంది.
మరి తన ఆందోళనలను, మానసిక పరిస్థితిని దాటి ఆ సీరియల్ కిల్లర్ ను రీటా పట్టుకుందా? ఆ కిల్లర్ ఎందుకు అంత క్రూరంగా హత్యలు చేశాడు? అన్నది దల్‌దల్ సిరీస్ లో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


