Comedy Web Series: సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో స్ట్రీమింగ్ డేట్
Comedy Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో కామెడీ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త సీజన్ రానుందంటూ అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
Comedy Web Series: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపులర్ కామెడీ వెబ్ సిరీస్ ‘దుపహియా’ (Dupahiya) రెండో సీజన్‌కు సంబంధించి ప్రైమ్ వీడియో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. గజ్‌రాజ్ రావు, రేణుకా షహాణే, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రూరల్ కామెడీ డ్రామా సిరీస్ అక్టోబర్ 1, 2026 నుంచి గ్లోబల్ వైడ్‌గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

నవ్వుల జాతరతో రాబోతున్న 'దుపహియా 2'
రూరల్ కామెడీ వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పంచాయత్, గ్రామ్ చికిత్సాలయ్ లాంటి సిరీస్ లు ఇప్పటికే ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయ్యాయి. ఆ కోవలో వచ్చిందే ఈ దుపహియా అనే వెబ్ సిరీస్. ఓ ఊళ్లో బైకు చోరీ చుట్టూ తిరిగే ఫన్నీ సిరీస్ ఇది.
ఇప్పుడీ రూరల్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్‌ను ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ‘సునో సునో సునో ధడక్‌పూర్ అబ్ క్రైమ్ ఫ్రీ నహీ రహా(వినండి.. వినండి.. వినండి.. ధడక్‌పూర్ ఇప్పుడు క్రైమ్ లేని ఊరు కాదు)’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే ఈసారి ధడక్‌పూర్ గ్రామంలో అంతకుమించిన కామెడీ, ట్విస్టులు ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.
పోస్టర్ కూడా ఆసక్తి రేపేలా ఉంది. ధడక్‌పూర్ పోలీస్ స్టేషన్ బయట ముగ్గురు వ్యక్తుల చేతులను కుర్చీ వెనక్కి కట్టేసి ఉండటం ఇందులో చూడొచ్చు.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలు, చిన్న చిన్న పాత్రల అమాయకత్వం, కామెడీ టైమింగ్ ఇష్టపడే ఓటీటీ లవర్స్‌కి 'దుపహియా' మొదటి సీజన్ బాగా నచ్చింది. ఇప్పుడు సీజన్ 2తో ప్రైమ్ వీడియో మరింత భారీ వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది.
దుపహియా సీజన్ 1 లో ఏం జరిగింది?
బీహార్‌లోని ఒక ఊహాజనిత గ్రామం 'ధడక్‌పూర్' నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. గత 25 ఏళ్లుగా రూపాయి దొంగతనం కూడా జరగకుండా 'క్రైమ్ ఫ్రీ విలేజ్'గా రికార్డు సృష్టించిన ఈ ఊరిలో, ఒక పెళ్లికి కట్నంగా ఇచ్చిన కొత్త బైక్ (దుపహియా) అకస్మాత్తుగా మాయమవుతుంది.
ఆ బైక్ వెతికే క్రమంలో పెళ్లికూతురు కుటుంబం, ఆమె మాజీ ప్రియుడు పడే పాట్లు, ఆ ఊరి సర్పంచ్ ఆందోళన నవ్వులు పూయించాయి. చిన్న చిన్న ఊళ్లలో ఉండే చిన్నపాటి సమస్యలకు కామెడీని జోడించి వెబ్ సిరీస్ తీయడంలో హిందీ మేకర్స్ బాగా సక్సెస్ అవుతున్నారనడానికి ఈ దుపహియా సిరీస్ కూడా ఓ నిదర్శనమే.
ఈసారి కొత్త ట్విస్టులు.. భోజ్‌పురి స్టార్ ఎంట్రీ
దుపహియా సీజన్ 2లో ధడక్‌పూర్ ఇక ఎంతమాత్రం 'క్రైమ్ ఫ్రీ' కాదనే పాయింట్‌తో కథను సరికొత్తగా మలిచారు. ఈ సీజన్‌లో గజ్‌రాజ్ రావు, రేణుకా షహాణే, స్పర్శ్ శ్రీవాస్తవ, భువన్ అరోరా, శివానీ రఘువంశీ, యశ్ పాల్ శర్మలతో పాటు భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేష్ లాల్ యాదవ్ (నిరహువా) కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
సోనమ్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను అవినాష్ ద్వివేది, చిరాగ్ గార్గ్ నిర్మించగా బొంబాయి ఫిలిం కార్టెల్ బ్యానర్ సమర్పించింది. ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఈ కామెడీ సిరీస్ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


