ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ చూశారా.. అదిరిపోయే మర్డర్ మిస్టరీ.. హంతకుడిని పట్టించే టాటూ

అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటైన థ్రిల్లర్ మూవీ పుణె హైవే. నలుగురు స్నేహితులు, ఒక హత్య చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఎన్నో ట్విస్టులు. ముఖ్యంగా క్లైమ్యాక్స్ ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది.

Published on: Jul 7, 2025, 11:13:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన థ్రిల్లర్ మూవీ పుణె హైవే (Pune Highway). ఈ ఏడాది మే 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. జులై 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించకపోయినా.. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో మాత్రం టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా దూసుకెళ్తోంది. మరి ఈ పుణె హైవే ఎందో చూడండి.

ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ చూశారా.. అదిరిపోయే మర్డర్ మిస్టరీ.. హంతకుడిని పట్టించే టాటూ
ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ చూశారా.. అదిరిపోయే మర్డర్ మిస్టరీ.. హంతకుడిని పట్టించే టాటూ

పుణె హైవే స్టోరీ ఏంటంటే?

పుణె హైవే ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీ నలుగురు స్నేహితులు ప్రమోద్ (అమిత్ సాధ్), నటాషా (మంజరి ఫడ్నిస్), విష్ణు (జిమ్ సర్బ్), నికొలస్ థామస్ (అనువబ్ పాల్) చుట్టూ తిరుగుతుంది. వీళ్లలో ప్రమోద్ ఓ ప్రముఖ పొలిటీషియన్ మధుసూదన్ మన్సేఖర్ (శిశిర్ శర్మ)కు ఆప్తుడిగా ఉంటాడు. విష్ణు ఓ లాయర్ కాగా.. నికొలస్ సినిమా తీయాలనే పట్టుదలతో ఉంటాడు.

ఇక మన్సేఖర్ కూతురు అయిన మోనా మన్సేఖర్ (కేతకి నారాయణ్) హత్యకు గురవుతుంది. సినిమా మొదట్లోనే ఓ ముంబైకి 142 కి.మీ. దూరంలోని ఓ చెరువులో కుళ్లిపోయిన దశలో ఆమె మృతదేహం కనిపిస్తుంది. ఆ హత్య ఎవరు చేశారో తేల్చడానికి సీఐ ప్రభాకర్ పేటె (సుదీప్ మోదక్) రంగంలోకి దిగుతాడు.

మొదట అసలు ఆ మృతదేహం ఎవరిదో కనిపెట్టి ఆ తర్వాత దర్యాప్తు చేసే క్రమంలో అతనికి ఎంతో మంది అనుమానితులు కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చిన్న టాటూ హంతకుడిని ఎలా పట్టిస్తుంది? ఈ హత్య ఆ నలుగురి స్నేహితుల జీవితాలను ఎలా మార్చేస్తుంది? అసలు హత్య ఎవరు, ఎందుకు చేశారన్నదే ఈ పుణె హైవే మూవీ స్టోరీ.

పుణె హైవే మూవీ రివ్యూ

పుణె హైవే ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమాను బగ్స్ భార్గవ కృష్ణ, రాహుల్ ద కన్హ డైరెక్ట్ చేశారు. జులై 4న ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్ మూవీస్ లో 4వ స్థానంలో ఉంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. ఆ సినిమాలు, సిరీస్ దారిలోనే ఈ పుణె హైవే సాగుతుంది.

ఎక్కడో జరిగిన ఓ హత్య నలుగురు స్నేహితుల జీవితాలను ఎలా మార్చేసిందన్న కథాంశంతో ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. సస్పెన్స్ ను చివరి వరకూ కొనసాగించాలన్న ఉద్దేశంతో అన్ని మర్డర్ మిస్టరీల్లాగే ఇందులోనూ మొదట్లో అనుమానితులను తెరపైకి తీసుకురావడం, వాళ్ల పాత్ర ఏమీ లేదని గుర్తించడం.. ఇలా సాగిపోతుంది.

స్టోరీ కాలంలో వెనక్కి, ముందుకు వెళ్తూ కొన్నిసార్లు అయోమయానికి గురి చేస్తుంది. అయితే చివరి వరకూ హంతకుడు ఎవరన్న ఆసక్తిని మాత్రం రేకెత్తిస్తూనే ఉంటుంది. ఓ చిన్న టాటూ ఆ హంతకుడిని ఎలా పట్టించిందన్న ట్విస్ట్ క్లైమ్యాక్స్ లో ఆశ్చర్యపరుస్తుంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లు ఓసారి ఈ పుణె హైవే చూడొచ్చు. అయితే కేవలం హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More