Ameesha Patel: హార్దిక్ పాండ్యాతో అఫైర్ రూమర్స్.. అమీషా పటేల్ ఘాటు రిప్లై.. నీకు ఒక్క గర్ల్ కూడా ఫ్రెండ్‌గా లేదంటూ..

Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో రిలేషన్షిప్ లో ఉందా? దీనిపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు ఆమె వెటకారంగా స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఆమె ఏమన్నదో చూడండి.

Published on: Sep 7, 2026, 13:07:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ameesha Patel: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్లపై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ ఊహించని రీతిలో స్పందించారు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఒక పార్టీలో హార్దిక్ భుజంపై అమీషా చేయి వేసి ఫ్రెండ్స్‌కు పరిచయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై ఒక నెటిజన్ చేసిన రొమాంటిక్ కామెంట్‌కు అమీషా కాస్త వెటకారంగా కౌంటర్ ఇచ్చారు.

Ameesha Patel: హార్దిక్ పాండ్యాతో అఫైర్ రూమర్స్.. అమీషా పటేల్ ఘాటు రిప్లై.. నీకు ఒక్క గర్ల్ కూడా ఫ్రెండ్‌గా లేదంటూ..
Ameesha Patel: హార్దిక్ పాండ్యాతో అఫైర్ రూమర్స్.. అమీషా పటేల్ ఘాటు రిప్లై.. నీకు ఒక్క గర్ల్ కూడా ఫ్రెండ్‌గా లేదంటూ..

నెటిజన్ పోస్ట్‌కు అమీషా ఘాటు రిప్లై

హార్దిక్ పాండ్యా భుజంపై చేయి వేసిన వీడియోను ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. "బెంగళూరు హోటల్‌లో జరిగిన పార్టీలో హార్దిక్ భుజంపై అమీషా చేయి వేసిన తీరు చూస్తుంటే రెడిట్‌లో వస్తున్న రూమర్స్ నిజమే అనిపిస్తోంది" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అమీషా పటేల్ తీవ్రంగా స్పందించారు.

సదరు పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ అమీషా గట్టి కౌంటర్ ఇచ్చారు. "అవును నువ్వు చెప్పింది నిజమే.. నా చేయి అతడి భుజంపై ఎంత రొమాంటిక్ వేలో ఉందో కదా! నీకు ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ఫ్రెండ్‌గా లేదని అర్థమవుతోంది. ఇలాంటి పోస్టులు పెట్టేముందు ఒక గర్ల్ ఫ్రెండ్‌ను వెతుక్కోవడం బెటర్" అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.

50 ఏళ్ల వయసులోనూ సింగిల్.. పెళ్లిపై అమీషా ఓపెన్ టాక్

50 ఏళ్ల వయసులోనూ ఒంటరిగానే ఉంటున్న అమీషా పటేల్.. తన మ్యారేజ్, రిలేషన్‌షిప్‌లపై గతంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తను ఒకరితో సీరియస్ రిలేషన్‌లో ఉన్నానని, అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఆ వ్యక్తికి నచ్చకపోవడంతో విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. తన కెరీర్‌కు సపోర్ట్ చేసే సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి రెడీగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.

తనకంటే సగం వయసు ఉన్న యంగ్ కుర్రాళ్లు కూడా డేటింగ్ ప్రపోజల్స్ పంపుతున్నారని, మైండ్ సెట్ మ్యాచ్ అయితే డేటింగ్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమీషా చెప్పారు. 'కహో నా ప్యార్ హై', తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' సినిమాలతో మెప్పించిన ఈ భామ.. ఇటీవల 'గదర్ 2' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొని రీ-ఎంట్రీ ఇచ్చారు.

మహికా శర్మతో హార్దిక్ పాండ్యా ప్రేమాయణం

ఇక హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత ప్రస్తుతం మోడల్ మహికా శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2025 అక్టోబర్‌లో తన పుట్టినరోజు సందర్భంగా మహికాతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ రిలేషన్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.

క్రికెట్ మ్యాచ్‌ల సమయంలోనూ మహికా స్టేడియంలో హార్దిక్‌కు సపోర్ట్ చేస్తూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమీషాతో హార్దిక్‌ను లింక్ చేస్తూ వచ్చిన రూమర్లకు అమీషా ఇచ్చిన ఈ కౌంటర్‌తో ఫుల్ స్టాప్ పడినట్లయింది.

అమీషా పటేల్ ఇచ్చిన రిప్లై
అమీషా పటేల్ ఇచ్చిన రిప్లై
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More