Amitabh Bachchan Retirement: అమితాబ్ బచ్చన్ రిటైర్మెంట్.. ఆ వైరల్ పోస్టు వెనుక మతలబేంటో చెప్పిన బిగ్ బీ
Amitabh Bachchan Retirement: అమితాబ్ బచ్చన్ తన రిటైర్మెంట్ వార్తలపై కాస్త ఘాటుగా, మరికాస్త సెటైరికల్ గా స్పందించారు. నిద్ర పోవడానికి, పని నుంచి పూర్తిగా తప్పుకోవడానికి మధ్య తేడా తెలియదా అంటూ మీడియాకు క్లాస్ పీకారు.
Amitabh Bachchan Retirement: బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు ఒక్క దెబ్బతో చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో, కొన్ని మీడియా కథనాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ తన అధికారిక బ్లాగ్ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి గానీ, బుల్లితెర పాపులర్ గేమ్‌షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC)కి గానీ తాను ఎలాంటి గుడ్‌బై చెప్పడం లేదని స్పష్టం చేశారు.

"రిటైర్మెంట్ అంటే అదా అర్థం?".. మీడియాపై బిగ్ బీ ఫైర్
కొద్దిరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో "Time to retire" అని రాసుకొచ్చారు. దాంతో ఆయన నటన నుంచి, కేబీసీ షో నుంచి తప్పుకుంటున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ పుకార్లను బిగ్ బి తీవ్రంగా తప్పుపట్టారు.
ఆంగ్లంలో 'రిటైర్' అంటే కేవలం ఉద్యోగం నుంచి తప్పుకోవడం మాత్రమే కాదని, రాత్రి వేళ పడుకోవడానికి వెళ్లడాన్ని కూడా 'రిటైర్ టు బెడ్' అంటారని ఆయన గుర్తుచేశారు. "లేట్ అయింది, నిద్రపోవడానికి సమయం అయింది అని నేను రాస్తే.. దాన్ని పట్టుకుని నా రిటైర్మెంట్ అంటూ కథనాలు అల్లేశారు. వాహ్.. దేశానికి దిశానిర్దేశం చేసే మీడియా జ్ఞానం ఇది!" అంటూ సెటైరికల్‌గా స్పందించారు.
తన తాజా పోస్ట్‌లో హిందీ, ఇంగ్లీష్ మిక్సింగ్ డైలాగ్‌తో క్లారిటీ ఇస్తూ.. "జీ నహీ హుజూర్, మై కామ్ సే రిటైర్ నహీ హో రహా హూమ్ (లేదు స్వామీ, నేను నా పని నుంచి రిటైర్ కావడం లేదు). ఇంగ్లీషులో దానికి అర్థం నిద్రపోవడానికి వెళ్తున్నానని! అక్కడికి మిమ్మల్ని ఎవరూ ఆహ్వానించలేదు కదా!" అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
కౌన్ బనేగా కరోడ్‌పతితో 24 ఏళ్ల ప్రయాణం
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 80 ఏళ్లు దాటినా కూడా ఆయన చూపిస్తున్న ఎనర్జీ కుర్ర హీరోలకు సైతం అసూయ పుట్టిస్తుంది.
2000వ సంవత్సరంలో కేబీసీ ప్రారంభమైనప్పటి నుంచి అమితాబ్ ఈ షోతో ముడిపడి ఉన్నారు. మధ్యలో 2007లో కేవలం ఒకే ఒక్క సీజన్‌కు షారుఖ్ ఖాన్ హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ అమితాబ్ చేతికే మైక్ వచ్చింది. ఇప్పటికీ టీఆర్‌పీ రికార్డులు తిరగరాస్తున్న ఈ షోను ఆయన వీడే ప్రసక్తే లేదని స్పష్టమైంది.
'కల్కి 2' అశ్వత్థామగా విధ్వంసం రీలోడెడ్
ఇక వెండితెర విషయానికొస్తే.. బిగ్ బీ ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి 'వెట్టయాన్' సినిమాలో నటించడమే కాకుండా, ఫర్హాన్ అక్తర్ '120 బహాదూర్' చిత్రానికి నరేటర్‌గా వ్యవహరించారు.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 AD: పార్ట్ 2'లో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా మరోసారి వీరవిహారం చేయనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ (భైరవ), విశ్వనటుడు కమల్ హాసన్ (యాస్కిన్)లతో కలసి ఆయన సీక్వెల్‌లో వేసే మాస్ యాక్షన్ సీన్స్ కోసం బాక్సాఫీస్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


