పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్న గేదె దెయ్యం, చిన్న పిల్లాడి పుర్రె.. సరికొత్త కాన్సెప్ట్‌తో నెపోలియన్ రిటర్న్స్ గ్లింప్స్
అల్ట్రా న్యూ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తెలుగు హారర్ కామెడీ చిత్రం నెపోలియన్ రిటర్న్స్. డైరెక్టర్ ఆనంద్ రవి దర్శకత్వం వహంచిన నెపోలియన్ రిటర్న్స్ గ్లింప్స్‌ను తాజాగా ఇవాళ రిలీజ్ చేశారు. గేదె దెయ్యం పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నదని చెప్పడం, ఇంట్లో చిన్న పిల్లాడి పుర్రె కనిపించడం సీన్స్‌తో అదిరిపోయింది.
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ రైటర్, డైరెక్టర్ ఆనంద్ రవి దర్శకత్వంలో సరికొత్త కాన్సెప్ట్‌తో ఓ సినిమా తెరకెక్కింది. భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు అంటే ఇవాళ (అక్టోబర్ 26) లాంఛ్ చేశారు.

నెపోలియన్ రిటర్న్స్ టైటిల్
ఆనంద్ రవి, బిగ్ బాస్ దివి వాద్యా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్ రవి రూపొందించిన నెపోలియన్, ప్రతినిధి, కొరమీను చిత్రాలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తనదైన స్టైల్‌లో
ఇప్పుడు ఈ యాక్టర్- డైరెక్టర్ ఆనంద్ రవి మరోసారి యూనిక్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో నెపొలియన్ రిటర్న్స్‌గా మన ముందుకు రాబోతున్నారు. ‘నెపోలియన్ రిటర్న్స్’ విషయానికి వస్తే ఆనంద్ రవి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ ప్రమోషనల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ అయింది.
సమస్యగా మారిన గేదె ఆత్మ
ఈ మూవీ ఎంటైర్ టీమ్ నెపోలియన్ రిటర్న్స్ టైటిల్ గ్లింప్స్‌ను ఇవాళ హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘నెపోలియన్’ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఆనంద్ రవి ఇద్దరితో కలిసి పోలీస్ స్టేషన్‌కు కంప్లైంట్ ఇవ్వటానికి వెళతాడు. ఓ గేదె ఆత్మ సమస్యగా మారిందని పోలీసుతో చెబుతాడు.
గేదె దెయ్యం కంప్లైంట్ ఇవ్వమందంటూ
ఆనంద్ రవి ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన విజువల్స్‌ను చాలా వేగంగా చూపించారు. దెయ్యం సమస్యగా మారిందని, అది గేదె దెయ్యం అని, ఆ గేదె దెయ్యం తమతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిందని ఆనంద్ రవి చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్‌గా, కామెడీగా ఆకట్టుకుంది.
చిన్న పిల్లాడి పుర్రె కనిపించడంతో
పోలీస్ రఘుబాబు సహా అందరూ ఆ గేదె ఆత్మ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటారు. మరోవైపు ఇంట్లో కనిపించే పుర్రె ఓ చిన్నారిదని చెప్పటంతో ఇదే సరికొత్త హారర్ సస్పెన్స్ మూవీ అనే భావన కలుగుతుంది. ఇక గ్లింప్స్ చివరలో ఓ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ రవితో ఇంతకు ముందే నువ్వే కదా నీడ పోయిందని కంప్లైంట్ ఇచ్చావ్ అని అడగటంతో నెపోలియన్ సినిమా రెఫరెన్స్‌ను అక్కడ చూపించారు.
నెపోలియన్ రిటర్న్స్ నటీనటుల
ఇది హైలెట్‌గా నిలిచింది. నెపోలియన్ రిటర్న్స్ గ్లింప్స్‌లో విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆనంద్ రవి, దివి వాద్యా, ఆటో రామ్ ప్రసాద్, రఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్రవణ్ రాఘవేంద్ర, యాంకర్ రవి, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు ఇందులో నటించారు.
రచన, దర్శకత్వం హీరో ఆనంద్ రవి
భోగేంద్ర గుప్తా నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు రచన-దర్శకత్వం ఆనంద్ రవి. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


