...
...
Next Story

అది మాట్లాడటం చేతగాక నన్ను ఆంటీ అంటారా అంటూ అనసూయ సీరియస్.. కెలికావ్ కదా పూర్తిగా దిగుతానంటున్న కరాటే కల్యాణి

నటుడు శివాజీ వివాదంలో ఇటు అనసూయ, అటు కరాటే కల్యాణి మధ్య కొత్తగా రచ్చ మొదలైంది. తనను ఆంటీ ఎందుకు అంటున్నారని ఓవైపు అనసూయ ప్రశ్నిస్తుంటే.. కెలికావ్ కదా ఇక తాను పూర్తిగా రంగంలోకి దిగుతానని కల్యాణి ఆమెకు వార్నింగ్ ఇచ్చింది.

Published on: Dec 25, 2025, 21:11:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

'దండోరా' ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించినందుకు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ట్రోలింగ్ బారిన పడింది. నెటిజన్లు తనను 'ఆంటీ' అని పిలుస్తూ వయసు గురించి అవహేళన చేయడంపై అనసూయ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు తాను వాడిన అసభ్య పదజాలానికి శివాజీ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు. కానీ కొత్తగా ఈ రచ్చలోకి కరాటే కల్యాణి వచ్చి చేరింది.

ఆంటీ అంటారా అంటూ అనసూయ ఆవేదన

అది మాట్లాడటం చేతగాక నన్ను ఆంటీ అంటారా అంటూ అనసూయ సీరియస్.. కెలికావ్ కదా పూర్తిగా దిగుతానంటున్న కరాటే కల్యాణి
అది మాట్లాడటం చేతగాక నన్ను ఆంటీ అంటారా అంటూ అనసూయ సీరియస్.. కెలికావ్ కదా పూర్తిగా దిగుతానంటున్న కరాటే కల్యాణి

హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి శివాజీ చేసిన కామెంట్స్ ఇష్యూ ఇంకా చల్లారలేదు. దీనిపై గళం విప్పిన అనసూయను సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడంతో ఆమె ఘాటుగా స్పందించింది.

విషయం మీద మాట్లాడలేక, తన వయసు గురించి మాట్లాడుతున్నారని అనసూయ మండిపడింది. ఆమె ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చింది.

"ఈ రోజు చివరిగా ఒక్క విషయం చెప్తా. అసలు సమస్య గురించి మాట్లాడలేక.. ఆడ, మగ తేడా లేకుండా అందరూ నా వయసు గురించి మాట్లాడుతూ నన్ను 'ఆంటీ' (Aunty) అని పిలుస్తున్నారు. కానీ ఆయన్ని (శివాజీని) మాత్రం ఎంతో గౌరవంగా సంభోదిస్తున్నారు. నా వయసు 40, ఆయనకు 54 ఏళ్లు ఉంటాయనుకుంటా. వృత్తి రీత్యా, వ్యక్తిగత కారణాల వల్ల మేమిద్దరం గ్లామర్ మెయింటైన్ చేస్తున్నాం. నన్ను విమర్శించే వాళ్లందరికీ ఎప్పటికీ వయసు పెరగదేమో మరి? నేను ఎంత చెప్పినా.. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది" అని అనసూయ ట్వీట్ చేసింది.

తగ్గేదే లేదు

ఎవరు ఏమనుకున్నా, ఏం జరిగినా.. తాను మాత్రం సమాజంలో వినిపించని గొంతుకలకు అండగా నిలబడతానని, ధైర్యంగా ఉంటానని అనసూయ స్పష్టం చేసింది. చివర్లో ఒక హిందీ డైలాగ్ కొట్టి ట్రోలర్లకు గట్టి సమాధానం ఇచ్చింది. "ఆప్ జలన్ బర్కరా రఖ్నా.. హమ్ జల్వా బర్కరా రఖేంగే.." (మీరు మీ అసూయను అలాగే ఉంచుకోండి.. నేను నా హవాను అలాగే కొనసాగిస్తాను) అని అనసూయ అనడం విశేషం.

కరాటే కల్యాణి కౌంటర్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe