గెలుస్తాననుకున్నా-మ‌మ్మాతో ఉండ‌టం మైన‌స్ అయింది-బిగ్ బాస్ బజ్‌లో ఇమ్మాన్యుయేల్‌-గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌ర్రా అని అడిగిన శివాజీ

బిగ్ బాస్ 9 సీజన్ లో తన కామెడీతో అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ ఇచ్చి, అసలైన ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలిచాడు ఇమ్మాన్యుయేల్. అతను ఈ సీజన్ ట్రోఫీ అందుకుంటాడని చాలా మంది అనుకున్నారు. ఇమ్ము కూడా ఇదే ఫీలయ్యాడు. తాజాగా శివాజీతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో సంజనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇమ్ము. 

Published on: Dec 25, 2025 11:05 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో కచ్చితంగా టైటిల్ రేసులో ఉంటాడనుకున్న కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. అతను విజేతగా నిలుస్తాడని చాలా మంది భావించారు. కనీసం టాప్-2లో అయినా నిలుస్తాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతను నాలుగో ప్లేస్ లో హౌస్ నుంచి వెళ్లిపోవడం షాక్ కలిగించింది. ఇది అన్యాయమంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఇమ్ము ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

శివాజీ, ఇమ్మాన్యుయేల్ (youtube)
శివాజీ, ఇమ్మాన్యుయేల్ (youtube)

ఎంట‌ర్‌టైన‌ర్‌

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచాడు. టాప్-5కు చేరిన ఇమ్ము నాలుగో స్థానంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఇమ్ముకు హోస్ట్ శివాజీ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఎంట‌ర్‌టైన‌ర్‌ ఆఫ్ ది సీజన్ 9 ఇమ్మాన్యుయేల్ అని గ్రాండ్ గా వెల్ కమ్ ఇచ్చాడు. లాఫింగ్ బుద్ధ బొమ్మతో కూడిన ట్రోఫీ అందించాడు.

విన్నర్ అవుతావనుకుంటే

బిగ్ బాస్ బజ్ లో శివాజీ, ఇమ్ము ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ‘‘విన్నర్ అయిపోతావ్ అనుకుంటే ఇలా వచ్చావేంట్రా’’ అని శివాజీ అడుగుతాడు. ‘‘నేను అనుకున్నా కానీ..’’ అంటూ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అవుతాడు. ‘‘నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తూనే వాళ్లు నిన్ను వీక్ చేసేశారు. నువ్వు కనుక నామినేషన్లలోకి వస్తే, ఎంటర్ టైనర్ ఓట్లు వేయాలని అనుకునేవాళ్లు’’ అని శివాజీ అంటాడు.

10 వారాలు

‘‘ఇది గేమ్, ప్రతి చిన్న విషయాన్ని తప్పులాగే చూడాలని నాకు అర్థమయ్యేసరికి 10 వారాలు అయిపోయింది’’ అని బిగ్ బాస్ హౌస్ లోని పరిస్థితుల గురించి చెప్పాడు ఇమ్ము. ‘‘నిన్ను ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఓట్లు వేయడమే మర్చిపోయారు ఆడియన్స్’’ అని శివాజీ అంటాడు.

మమ్మాతో మైనస్

‘‘మమ్మా (సంజన)తో కలవడం వల్ల ప్లస్ అయింది అనుకుంటున్నావా? మైనస్ అయింది అనుకుంటున్నావా?’’ అని స్ట్రెయిట్ కొశ్చన్ అడుగుతాడు శివాజీ. ‘‘మైనస్ అయిందనే అనుకుంటున్నా. నేను నామినేషన్లోకి రావట్లేదు. నన్ను అభిమానించే వాళ్లందరూ మా మమ్మాకు ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్’’ అని ఇమ్ము సీరియస్ గానే చెప్తాడు.

ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవర్రా? అని రాబట్టే ప్రయత్నం చేస్తాడు శివాజీ. ఇప్పుడు మాట్లాడతావా? అంటే వద్దన్న పర్వాలేదని నవ్వేస్తాడు ఇమ్ము.

మూడు సార్లు కెప్టెన్

ఒక సీజన్ లో ఒక మనిషి మూడు సార్లు కెప్టెన్ అవడం గత 8 సీజన్లలో ఎప్పుడూ జరగలేదని ఇమ్మాన్యుయేల్ ను పొగిడేస్తాడు శివాజీ. ‘విన్ ఆర్ లూస్.. విన్ అయ్యేంత పని చేశాడ్రా అని అనిపించుకోవాలి. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ టైన్ చేయడం ఈజీ జాబ్ కాదు. ఒకరేమో అప్పుడే నామినేట్ అయిన కోపంలో ఉంటాడు. ఇంకొకరు నేను నామినేట్ చేశానన్న కోపంలో ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కో మూడ్ లో ఉంటారన్న’’ అని ఇమ్ము చెప్తాడు. అవన్నీ దాటుకుని వాళ్లను ఎంటర్ టైన్ చేశావంటే గ్రేట్ అని శివాజీ అంటాడు.