OTT Release: అఫీషియల్.. ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ తమిళ్ మూవీ.. హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి లవ్.. ఎప్పుడంటే?

OTT Release: కోలీవుడ్ సూపర్‌హిట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'అన్బే డయానా' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. సీనియర్ నటి రోజా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా తెలుగు సహా 5 భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఓటీటీ పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Aug 22, 2026, 19:32:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release: తమిళనాడు థియేటర్లలో సంచలనం సృష్టించిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అన్బే డయానా' (Anbe Diana) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ హిట్ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (SonyLIV) సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అఫీషియల్.. ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ తమిళ్ మూవీ.. హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి లవ్.. ఎప్పుడంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ తమిళ్ మూవీ.. హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి లవ్.. ఎప్పుడంటే?

రోజా రీ ఎంట్రీ

ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన సీనియర్ నటి రోజా ఈ అన్బే డయానా మూవీతో చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోకు తల్లిగా రోజా నటించారు. పద్ధతైన తెలుగు ఫ్యామిలీని నడిపించే ఇల్లాలిగా కనిపించారు. కొడుకు క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకొని ఆ తల్లి ఏం చేసిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

అన్బే డయనా ఓటీటీ

'అన్బే డయానా' చిత్రం ఆగస్టు 28 నుంచి సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఓటీటీలో ఈ సినిమాను కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం డిజిటల్ వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డైరెక్టరే హీరో

పారి ఇళవళగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయనే స్వయంగా హీరోగా నటించారు. రమ్య రంగనాథన్ కథానాయికగా మెప్పించగా, సీనియర్ నటి రోజా సెల్వమణి, పరితాబంగళ్ గోపి, చేతన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మిల్లియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాజిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. భరత్ శంకర్ అందించిన సంగీతం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

స్టోరీ ఇదే

ఒక సాధారణ తెలుగు యువకుడికి, ఆంగ్లో-ఇండియన్ క్రిస్టియన్ యువతికి మధ్య చిగురించిన ప్రేమ కథ ఆధారంగా ఈ అన్బే డయానా మూవీని తెరకెక్కించారు. సంప్రదాయాలు, కుటుంబ నేపథ్యాల మధ్య ఈ జంట తమ ప్రేమను ఎలా గెలిపించుకుందనేది వినోదాత్మకంగా దర్శకుడు రెడీ చేశాడు.

అబ్బాయి వాళ్లు ఏమో పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగాలని డిమాండ్ చేస్తారు. అమ్మాయి తండ్రి ఏమో క్రిస్టియన్ వెడ్డింగ్ చేయిస్తానని పట్టుబడతాడు. మరి చివరకు ఏమైందో అన్బే డయానా సినిమాలో చూడాల్సిందే.

జూలైలో థియేటర్లలో విడుదలైన అన్బే డయానా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఆగస్టు 28 నుంచి సోనీ లివ్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More