Tamil OTT: హిందూ మ్యారేజా లేదా చర్చి వెడ్డింగా? ఓటీటీలోకి తెలుగులో వచ్చేస్తున్న తమిళ లవ్ కామెడీ మూవీ.. తల్లిగా రోజా!
Tamil OTT: కోలీవుడ్‌లో అదరగొట్టిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అన్‌బే డయానా’ ఓటీటీలోకి వచ్చేస్తుంది. రెండు వేర్వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి లవ్ స్టోరీకి ఎలాంటి ఎండింగ్ దక్కిందనే కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో సీనియర్ నటి రోజా హీరోకు తల్లిగా నటించింది. ఈ మూవీ ఓటీటీ వివరాలపై లుక్కేయండి.
Tamil OTT: తమిళనాట బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందిన తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం 'అన్‌బే డయానా' (Anbe Diana). ఈ లవ్ స్టోరీ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మతాంతర వివాహం చుట్టూ సాగే కామెడీ ఎంటర్ టైనర్ ఈ ఫిల్మ్.

అన్‌బే డయానా ఓటీటీ
జూలై 17, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నఅన్‌బే డయానా సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (SonyLIV) సొంతం చేసుకుంది.
ఆగస్టు 14, 2026 నుంచి ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ లాంగ్ వీకెండ్‌లో ఓటీటీ ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.
కల్చరల్ రచ్చ
చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంలో సాగే ఈ 'అన్‌బే డయానా' చిత్రం విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కింది. సంప్రదాయ తెలుగు కుటుంబానికి చెందిన అథ్లెటిక్స్ కోచ్ చిరుమామిళ్ల సీతా కృష్ణ, స్వేచ్ఛాయుతమైన భావాలు కలిగిన ఆంగ్లో-ఇండియన్ ఐటీ ఉద్యోగిని "మ్యాజిక్" డయానా డిసౌజాల మధ్య చిగురించిన ప్రేమ ఈ సినిమా కథాంశం.
పెళ్లి ఎలా?
కుల, మత పట్టింపులు ఉన్న సాంప్రదాయ తెలుగు కుటుంబంలో 'సుమంగళి పూజ' జరపాలని అనుకుంటే, డయానా కుటుంబం గ్రాండ్ చర్చి వెడ్డింగ్ చేయాలని భావిస్తుంది.
రెండు భిన్న సంస్కృతులు, మత విశ్వాసాల మధ్య నలిగిపోయే ఈ ప్రేమికులు తమ కుటుంబాలను ఎలా ఒప్పించారనేది దర్శకుడు ఎంతో వినోదాత్మకంగా మలిచారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ సీన్లు ఓటీటీ వీక్షకులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి.
అద్భుతమైన తారాగణం
ఈ చిత్రానికి పారి ఎలావళగన్ (Pari Elavazhagan) కథ, కథనం, దర్శకత్వం వహించడమే కాకుండా కథానాయకుడిగా 'సీతా కృష్ణ' పాత్రలో జీవించారు. ఆయన సరసన రమ్య రంగనాథన్ (Ramya Ranganathan) డయానా పాత్రలో నటనతో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో చేతన్ కదంబి, రోజా సెల్వమణి, పరితాబంగల్ గోపి, సెల్ మురుగన్, నిఖిలా శంకర్, ఇస్మత్ బాను, సుదర్శన్ గాంధీ కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీ అంచనాలు
థియేటర్లలో మంచి రివ్యూలు సాధించిన ఈ అన్‌బే డయానా సినిమా ఓటీటీలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. సోనీలివ్ ఓటీటీ వేదికపై తెలుగు ఆడియన్స్ నుంచి కూడా ఈ మూవీకి భారీ స్పందన దక్కుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


