Tamil Thriller OTT: ఈ 9.5 రేటింగ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో కచ్చితంగా ఎందుకు చూడాలో తెలుసా? ఇవిగో 5 రీజన్స్!
Tamil Thriller Anbil Avan OTT: ఓటీటీలోకి తెలుగులో మరో తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన ‘అన్బిల్ అవన్’ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఐఎండీబీలో ఏకంగా 9.5 రేటింగ్ ఉన్న ఈ చిత్రాన్ని ఓటీటీలో ఎందుకు చూడాలో తెలుసుకోండి.
Tamil Thriller Anbil Avan OTT: అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'అన్బిల్ అవన్' (Anbil Avan) ఓటీటీలోకి వచ్చేస్తోంది. నవంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) వేదికగా ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టిన ఈ చిత్రాన్ని మీరు ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదో చెప్పే 5 ప్రధాన కారణాలు ఇక్కడ చూద్దాం.

అద్భుతమైన కెమిస్ట్రీ
'అన్బిల్ అవన్' చిత్రానికి అతిపెద్ద బలం హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్ ప్రీతి ముకుందన్ ల యాక్టింగ్. కొత్తగా పెళ్లైన సూర్య, ఇయల్ అనే క్యూట్ కపుల్ గా వీరు నటించారు. పెళ్లైన కొత్త జంట మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్స్ ను నేచురల్ గా పండించారు. ఫస్ట్ హాఫ్ లో వీరి రొమాంటిక్ ట్రాక్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.
రొమాన్స్ టు సర్వైవల్ థ్రిల్లర్
స్టార్టింగ్ లో అన్బిల్ అవన్ మూవీ క్యూట్ లవ్ స్టోరీలా ఫీల్ గుడ్ వైబ్స్ ఇస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ జంట తమ కలల ఇంటి కోసం ఒక మారుమూల హిల్ స్టేషన్ కు మకాం మారుస్తారో.. అప్పటి నుంచి కథ మొత్తం ఊహించని మలుపు తిరుగుతుంది.
తమ సొంత ఇంటి కలను నిజం చేసుకునే క్రమంలో ఒక అవినీతి సామ్రాజ్యంలో వారు ఎలా చిక్కుకున్నారు? ప్రాణాపాయ స్థితి నుంచి భార్యను కాపాడుకునేందుకు హీరో ఏం చేశాడు? అనేది చాలా థ్రిల్లింగ్ గా సాగుతుంది. సినిమా సెకండాఫ్ సర్వైవల్ థ్రిల్లర్ గా మారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
మైండ్ బ్లోయింగ్ యాక్షన్
ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఫేమస్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్. ముఖ్యంగా తన భార్య కోసం హీరో చేసే పోరాటం, అందుకోసం ప్రైవేట్ ఆర్మీని ఎదుర్కొనే సీన్స్ అదుర్స్ అనిపిస్తాయి. అశోక్ సెల్వన్ ఏకంగా 70 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి బాడీ డబుల్ లేకుండా నీళ్లలోకి దూకేసిన రియలిస్టిక్ స్టంట్ ఈ యాక్షన్ పార్ట్ కే హైలైట్.
థ్రిల్స్ ను పెంచే మ్యూజిక్, విజువల్స్
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం లాంటిది. '96' ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత తన బీజీఎమ్ తో ప్రతి సీన్ లోనూ టెన్షన్ ను అమాంతం పెంచేశాడు. ఇక గౌతమ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ హిల్ స్టేషన్ లోని అందాలతో పాటు, అక్కడి భయానక చీకటి వాతావరణాన్ని కెమెరాలో అద్భుతంగా బంధించింది. టెక్నికల్ గా ఈ సినిమా క్వాలిటీ చాలా రిచ్ గా ఉంటుంది.
భయపెట్టే విలనిజం
కథలో హీరోకి ఎదురుగా నిలబడే విలన్స్ బలంగా ఉంటేనే సినిమా అదుర్స్ అనిపిస్తుంది. ఈ అన్బిల్ అవన్ సినిమాలో అవినీతి ఎమ్మెల్యే రాజనాయగంగా కదిర్ బాలు, క్రూరమైన లాయర్ మార్టిన్ గా సాబుమోన్ అబ్దుసమద్, కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా మహా ఢిల్లీ గణేష్ తమ విలనిజంతో భయపెడతారు.
డెబ్యూ డైరెక్టర్ ఆర్. కార్తికేయన్ అద్భుతమైన టేకింగ్ తో వచ్చిన 'అన్బిల్ అవన్' మూవీ కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు.. ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్ కలగలిపిన ఒక పర్ఫెక్ట్ సర్వైవల్ థ్రిల్లర్. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు సోనీ లివ్ (SonyLIV) లో అస్సలు మిస్ అవ్వకండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


