Vishnu Priya: పోలీస్ స్టేషన్‌లో యాంకర్ విష్ణుప్రియ.. యూట్యూబర్‌పై కేసు.. అలాంటి వాళ్లందరికీ వార్నింగ్
Vishnu Priya: ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమినేని పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఓ యూట్యూబర్ పై కేసు పెట్టింది. ఇక నుంచి అలాంటి వాళ్లను వదిలి పెట్టబోనని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది.
Vishnu Priya: సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారంటూ ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలు రూపొందించిన ఓ మహిళా యూట్యూబర్‌పై ఆమె హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివాదాల కేంద్రంగా ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్
బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయిన విష్ణుప్రియ.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ ద్వారా వార్తల్లో నిలిచారు.
అయితే ఆమె పోస్ట్ చేస్తున్న కొన్ని వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని, యువతను తప్పుదోవ పట్టించేలా ఆమె వ్యవహరిస్తున్నారని నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. సబ్‌స్క్రిప్షన్ పేరుతో ఆమె లక్షలు గడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
యూట్యూబర్ 'సోనాలి'పై ఫిర్యాదు
ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకున్న 'సోనాలి' అనే ఓ యూట్యూబర్.. విష్ణుప్రియను టార్గెట్ చేస్తూ తన ఛానెల్‌లో ఓ 'రోస్టింగ్' వీడియోను పోస్ట్ చేసింది. అందులో విష్ణుప్రియ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి వాస్తవాలను వక్రీకరిస్తూ, ఆమెను కించపరిచేలా కంటెంట్ ఉందని విష్ణుప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పరువుకు నష్టం కలిగించేలా వీడియోలు చేసిన సదరు యూట్యూబర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం మియాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విష్ణుప్రియ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మిగతా వారికి కూడా వార్నింగ్
ఈ పరిణామంతో తనపై నెగిటివిటీ వ్యాప్తి చేసేవారికి విష్ణుప్రియ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది. వ్యూస్ కోసం తన వ్యక్తిగత జీవితంపై లేనిపోని నిందలు వేస్తూ, అసభ్యకరంగా రోస్టింగ్ వీడియోలు చేసే ఏ యూట్యూబర్‌నైనా వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇకపై తనపై ఎవరైనా వేధింపులకు గురిచేసేలా వీడియోలు చేస్తే చట్టపరంగా ముందుకెళ్తానని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం టీవీ షోలలో అడపాదడపా కనిపిస్తున్న విష్ణుప్రియ.. ఒకేసారి పోలీస్ కేసుతో వార్తల్లోకి రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


