Anil Ravipudi: అనిల్ రావిపూడి, రామ్ పోతినేని క్రేజీ కాంబినేషన్ ఫిక్సయినట్లేనా? పదేళ్ల తర్వాత అంటూ వార్తలు

Anil Ravipudi: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైనట్లు సమాచారం. దాదాపు పదేళ్ల తర్వాత వీరి కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని 2027 దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Published on: May 27, 2026, 13:57:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anil Ravipudi: తెలుగు సినిమా ప్రేక్షకులకు హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఎనర్జీని సమానంగా అందించే హీరో రామ్ పోతినేని, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నవ్వులు పూయించే హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

Anil Ravipudi: అనిల్ రావిపూడి, రామ్ పోతినేని క్రేజీ కాంబినేషన్ ఫిక్సయినట్లేనా? పదేళ్ల తర్వాత అంటూ వార్తలు
Anil Ravipudi: అనిల్ రావిపూడి, రామ్ పోతినేని క్రేజీ కాంబినేషన్ ఫిక్సయినట్లేనా? పదేళ్ల తర్వాత అంటూ వార్తలు

అనిల్, రామ్ క్రేజీ కాంబో

నిజానికి అనిల్ రావిపూడి, రామ్ పోతినేని కాంబినేషన్‌లో ఎప్పుడో ఒక సినిమా రావాల్సింది. రవితేజ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ 'రాజా ది గ్రేట్' కథను అనిల్ రావిపూడి మొదటగా రామ్ కోసమే రాసుకున్నారట. ఆ కథను రామ్‌కు వినిపించడం కూడా జరిగింది.

అయితే అప్పటికే వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తుండటంతో, కాస్త విభిన్నంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును రామ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ కథ రవితేజ వద్దకు వెళ్లడం, అది పెద్ద హిట్‌గా నిలవడం తెలిసిందే.

దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ అయింది. అనిల్ రావిపూడి చెప్పిన ఓ కొత్త లైన్‌కు రామ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత వీరిద్దరి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ భారీ చిత్రాన్ని 2027 దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం.

రామ్ సొంత దర్శకత్వంలో...

ప్రస్తుతం రామ్ పోతినేని తన 23వ చిత్రానికి (RAPO 23) స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తన పుట్టినరోజున (మే 15) ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 'ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్' అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రామ్ 'వీర' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై అతని సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మల్టీస్టారర్‌తో బిజీగా అనిల్..

మరోవైపు అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2026 జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే రామ్-అనిల్ కాంబో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే అభిమానుల అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండటం ఖాయం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

రామ్ పోతినేని, అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రాన్ని 2027 దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

గతంలో రామ్ ఏ అనిల్ రావిపూడి సినిమాను మిస్ చేసుకున్నారు?

అనిల్ రావిపూడి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'రాజా ది గ్రేట్' కథను మొదటగా రామ్ పోతినేనికే వినిపించారు. కానీ వేరే కథలు చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును రామ్ తిరస్కరించారు.

ప్రస్తుతం రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏమిటి?

తన 23వ చిత్రానికి రామ్ పోతినేని తొలిసారిగా స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ఆయన 'వీర' అనే పాత్రలో నటిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More