Anil Ravipudi: అనిల్ రావిపూడా మజాకా.. ప్రమోషన్లు మరో రేంజ్.. జీవీ, అనంత్ శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టి టార్చర్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మూవీసే కాదు అతని ప్రమోషన్లు కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా వెంకటేశ్, కళ్యాణ్ రామ్ లతో తాను తీస్తున్న నెక్ట్స్ మూవీ ప్రమోషన్లు అప్పుడే మొదలుపెట్టిన అనిల్.. ఈ సినిమా కోసం జీవీ ప్రకాష్ కుమార్, అనంత్ శ్రీరామ్ లను ఇసుకలో పాతిపెట్టి టార్చర్ పెట్టిన వీడియో రిలీజ్ చేశాడు.

Published on: Jun 12, 2026, 21:18:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anil Ravipudi: అనిల్ రావిపూడిని లేటెస్ట్ గా టాలీవుడ్ కి దొరికిన జంధ్యాలగా చూస్తున్నారు. ఇప్పుడతడు అదే జంధ్యాల స్ఫూర్తిగా తన నెక్ట్స్ మూవీ ప్రమోషన్లు మొదలుపెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ లను ఇంట్రడ్యూస్ చేస్తూ.. వాళ్లను ఇసుకలో పాతిపెట్టి టార్చర్ పెడుతున్న ఫన్నీ వీడియోను రిలీజ్ చేశాడు. అదేంటో మీరూ చూసేయండి.

Anil Ravipudi: అనిల్ రావిపూడా మజాకా.. ప్రమోషన్లు మరో రేంజ్.. జీవీ, అనంత్ శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టి టార్చర్
Anil Ravipudi: అనిల్ రావిపూడా మజాకా.. ప్రమోషన్లు మరో రేంజ్.. జీవీ, అనంత్ శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టి టార్చర్

అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్లు

వెంకటేశ్, కళ్యాణ్ రామ్ లతో కలిసి అనిల్ రావిపూడి మూవీ చేస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు.. అప్పుడే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. తాజాగా శుక్రవారం (జూన్ 12) అనిల్ తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో మొదట్లోనే జంధ్యాల మూవీలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం సీన్ కనిపిస్తుంది.

అందులో బ్రహ్మానందాన్ని ఇసుకలో పాతిపెట్టి టార్చర్ పెట్టినట్లే.. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ను ఇసుకలో పాతిపెట్టి తనకు ఎలాంటి మ్యూజిక్ కావాలో చెబుతాడు అనిల్. ఆ తర్వాత లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ను కూడా అలాగే ఇసుకలో పాతిపెట్టడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

జీవీ ప్రకాష్ కు వెల్‌కమ్.. అనిల్ రావిపూడి ట్వీట్

ఈ మ్యూజికల్ అప్‌డేట్ ను ఒక ఫన్నీ కాన్సెప్ట్ వీడియో ద్వారా అనిల్ రావిపూడి అనౌన్స్ చేశారు. దీనిపై అతడు ట్వీట్ చేస్తూ.. "ఆడియన్స్ కు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యేలా మ్యూజిక్ అందించే జీవీ ప్రకాష్ టాలెంట్ అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. మా #VenkyAnil5 - #NKRAnil2 ప్రాజెక్ట్‌ లోకి ఆయనను ఆహ్వానించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫన్ కాన్సెప్ట్ వీడియోను మేము భలే ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం. ఈ ఐడియాను నమ్మి, మాతో కలిసి ఫన్ లో జాయిన్ అయినందుకు థాంక్యూ బ్రదర్. మనమిద్దరం కలిసి ఒక మంచి మెమొరీని క్రియేట్ చేయబోతున్నాం" అంటూ రాసుకొచ్చారు.

జీ.వి. ప్రకాష్ కుమార్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, సౌత్ లో స్టార్ హీరో కూడా. ఆయన అందించే ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ కానున్నాయి.

Top Production Houses | భారీ కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, నందమూరి కళ్యాణ్ రామ్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సౌత్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ పాటలు అందిస్తున్నారు.

అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు జీవీ ప్రకాష్ క్లాసిక్ మ్యూజిక్ తోడైతే వెండితెరపై మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి సంక్రాంతికి వచ్చి ఓ హిట్ కొట్టే అనిల్.. ఈసారి ఏం మాయ చేస్తాడో చూడాలి.

హెచ్‌టీ విశ్లేషణ

వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీతో పాటు మ్యూజిక్ కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. జీవీ ప్రకాష్ కుమార్ ప్రస్తుతం సౌత్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్స్ కొట్టిన జీవీ.. ఇప్పుడు వెంకీ - అనిల్ ప్రాజెక్ట్ లోకి రావడం సినిమా బిజినెస్ రేంజ్ ను పెంచుతుంది.

అనిల్ రావిపూడి ప్రమోషన్స్ ను ఎప్పుడూ చాలా కొత్తగా, ఫన్నీగా ప్లాన్ చేస్తారు. ఈసారి కూడా జీవీ ప్రకాష్ తో కలిసి చేసిన ఫన్ కాన్సెప్ట్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సినిమా ప్రమోషన్స్ కి మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు.

People Also Ask (FAQs)

వెంకటేశ్ - అనిల్ రావిపూడి కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందించబోతున్నారు.

ఈ సినిమాను ఏ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి?

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాకు లిరిక్స్ అందిస్తున్నది ఎవరు?

ప్రముఖ టాలెంటెడ్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఈ సినిమాకు పాటలు రాస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More