Rai Rai Raa Raa Song: రై రై రా రా సాంగ్ రాయడానికి ఆరు నెలలు పట్టింది.. దీని వెనుక అసలు అర్థం అదే: అనంత శ్రీరామ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుండి విడుదలైన 'రై రై రారా' సాంగ్ (Rai Rai Raa Raa Song) సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను, రామ్ చరణ్ స్పందనను లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

Mar 4, 2026, 20:10:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని 'రై రై రారా' పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఒక ఎత్తయితే, అనంత శ్రీరామ్ రాసిన స్ఫూర్తిదాయకమైన సాహిత్యం మరో ఎత్తు. ఈ పాట సాధిస్తున్న విజయంపై అనంత శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. అసలు ఈ పాట అర్థమేంటి? ఎందుకు తనకు ఆరు నెలల సమయం పట్టిందన్నది అతడు వివరించాడు.

Rai Rai Raa Raa Song: రై రై రా రా సాంగ్ రాయడానికి ఆరు నెలలు పట్టింది.. దీని వెనుక అసలు అర్థం అదే: అనంత శ్రీరామ్
Rai Rai Raa Raa Song: రై రై రా రా సాంగ్ రాయడానికి ఆరు నెలలు పట్టింది.. దీని వెనుక అసలు అర్థం అదే: అనంత శ్రీరామ్

'రై రై రారా' అనే పదం ఎలా పుట్టిందంటే..

పెద్ది మూవీలోని రై రై రా రా పాటలోని హుక్ లైన్ గురించి అనంత శ్రీరామ్ చెబుతూ.. "ఈ సినిమాలో హీరో ఒక లీడర్‌లా కనిపిస్తారు. పల్లెటూళ్లలో ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. బస్సు కండక్టర్ 'రై రై' అనగానే డ్రైవర్ బస్సును ముందుకు పోనిస్తాడు. అంటే.. జీవితంలో కూడా ఎక్కడా ఆగకుండా నిరంతరం ముందుకు సాగిపోవాలి అనే అర్థం వచ్చేలా ఈ పదాన్ని వాడాను. ఒక పెద్ద సినిమాకు ఇంతటి అర్థవంతమైన పాట రాయడం చాలా సంతోషంగా ఉంది" అని వివరించాడు.

రామ్ చరణ్ రియాక్షన్ ఇలా

ఈ పాట విన్నప్పుడు రామ్ చరణ్ స్పందన ఎలా ఉందని అడగ్గా.. "చరణ్ గారు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన మరో సీన్ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ పాటను మొదటిసారి విన్నారు. విన్న వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఆ క్షణం నాకు ఎంతో తృప్తినిచ్చింది" అని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.

ఆరు నెలల కష్టం

ఈ పాట రాయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందని అనంత శ్రీరామ్ వెల్లడించాడు. "ఇది కేవలం మాస్ సాంగ్ మాత్రమే కాదు, ఒక ఇన్సిపిరేషనల్ ట్రాక్. దర్శకుడు బుచ్చిబాబు గారు సాహిత్యం విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతి పదం గురించి మేము ఎన్నో చర్చలు జరిపాము. అందుకే ఈ పాటలోని ప్రతి లైన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది" అని తెలిపాడు.

అనంత శ్రీరామ్ ఇంకా ఏం చెప్పాడంటే?

'పెద్ది' సినిమాలో తాను మొత్తం మూడు పాటలు రాశానని, ఇప్పటికే వచ్చిన 'చికిరి చికిరి', 'రై రై రారా' పాటల కంటే రాబోయే పాటలు ఇంకా స్పెషల్‌గా ఉంటాయని అనంత శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్', 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలకు కూడా పాటలు అందిస్తున్నట్లు తెలిపాడు.

పెద్ది మూవీ నుంచి వచ్చిన రెండు పాటలూ యూట్యూబ్ లో దూసుకెళ్తున్నాయి. చాలా రోజుల తర్వాత రెహమాన్ తన స్టైల్ సాంగ్స్ ఇచ్చాడంటూ అభిమానులు చెబుతున్నారు. ఈ పెద్ది మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More