Rai Rai Raa Raa Song: రామ్ చరణ్ స్టెప్పులకు మెగాస్టార్ ఫిదా.. గర్వంగా ఉందంటూ ట్వీట్.. స్క్రీన్‌పై మంట పుట్టించారంటూ..
రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది' (Peddi) నుండి విడుదలైన 'రై రై రారా' (Rai Rai Raa Raa Song) సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటలో చరణ్ గ్రేస్, ఎనర్జీ చూసి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయిపోయాడు. మూవీ టీమ్ ను అభినందిస్తూ అతడు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'పెద్ది'. నిన్న అంటే సోమవారం (మార్చి 2) విడుదలైన ఈ సినిమాలోని రెండో పాట 'రై రై రారా' ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తన స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను కట్టిపడేశారు. తాజాగా ఈ సాంగ్‌పై మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

నిన్ను చూస్తే గర్వంగా ఉంది: చిరంజీవి
పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ రై రై రారా అనే సాంగ్ వచ్చిన సంగతి తెలుసు కదా. గతంలో వచ్చిన చికిరి చికిరిలాగే ఈ పాట కూడా వచ్చీ రాగానే ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించాడు.
"'పెద్ది' సినిమాలోని 'రై రై రారా' సాంగ్ వెండితెరపై నిప్పులు చెరుగుతోంది. ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్‌కు ఇది ఒక అద్భుతమైన కలయిక. రామ్ చరణ్ తెరపై చూపిస్తున్న ఆ గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్ చూస్తుంటే ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది. చరణ్ కదిలే తీరును చూడటం ఒక కన్నుల పండుగలా ఉంది" అని పేర్కొన్నాడు.
అంతేకాకుండా ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన రత్నవేలును, అర్థవంతమైన సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్‌ను అతడు ప్రత్యేకంగా అభినందించాడు. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యాజికల్ కంపోజిషన్, జానీ మాస్టర్ పవర్ ప్యాక్డ్ కొరియోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయని చిరు ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఏప్రిల్ 30న పాన్ ఇండియా రిలీజ్
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


