Anirudh Kavya Wedding: నాలుగు ప్రత్యేక విమానాలు.. ఆ దేశంలో పెళ్లి.. అనిరుధ్, కావ్య పెళ్లి ఏర్పాట్లు కళ్లు చెదిరే రీతిలో

Anirudh Kavya Wedding: సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గ్రీస్‌లో జరగనున్న ఈ బిగ్ ఫ్యాట్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చెన్నై నుంచి ఏకంగా నాలుగు చార్టర్డ్ ఫ్లైట్స్ సిద్ధమయ్యాయి.

Published on: Oct 19, 2026, 21:21:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Anirudh Kavya Wedding: సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ కో-ఓనర్ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ-వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది.

Anirudh Kavya Wedding: నాలుగు ప్రత్యేక విమానాలు.. ఆ దేశంలో పెళ్లి.. అనిరుధ్, కావ్య పెళ్లి ఏర్పాట్లు కళ్లు చెదిరే రీతిలో
Anirudh Kavya Wedding: నాలుగు ప్రత్యేక విమానాలు.. ఆ దేశంలో పెళ్లి.. అనిరుధ్, కావ్య పెళ్లి ఏర్పాట్లు కళ్లు చెదిరే రీతిలో

తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో వరుస చార్ట్‌బస్టర్ మ్యూజిక్‌తో రికార్డులు సృష్టిస్తున్న అనిరుధ్, సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరి రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చి విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

గ్రీస్‌లో రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్.. 4 ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్స్

తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం.. అనిరుధ్ - కావ్య మారన్‌ల పెళ్లి వేడుకను ఐరోపా ఖండంలోని అత్యంత మనోహరమైన దేశమైన గ్రీస్‌లో (Greece) ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ బిగ్ ఫ్యాట్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు, వీఐపీ అతిథులను చెన్నై నుంచి నేరుగా గ్రీస్ తరలించేందుకు ఏకంగా నాలుగు ప్రత్యేక చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దేశంలోనే అత్యంత సంపన్నమైన, విలాసవంతమైన వివాహాల్లో ఒకటిగా నిలవనున్న ఈ వేడుకకు సంబంధించిన ప్రణాళికలు అత్యంత గోప్యంగా జరుగుతున్నాయి. నవంబర్ 11న వీళ్ల పెళ్లి జరగనుంది.

రజనీకాంత్, సీఎం స్టాలిన్ కుటుంబాల సందడి

ఈ రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి సౌత్ ఇండియాకు చెందిన అత్యంత ప్రభావవంతమైన రాజకీయ, సినిమా కుటుంబాలు హాజరుకానున్నాయి. అనిరుధ్ రవిచందర్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు మేనల్లుడు. దీంతో రజనీకాంత్ కుటుంబం ఈ పెళ్లిలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

సన్ నెట్‌వర్క్ అధినేతలు, కేంద్ర మాజీ మంత్రులు, పారిశ్రామికవేత్తలతో కూడిన మారన్ కుటుంబ సభ్యులు అందరూ ఈ వేడుకకు వెళ్లబోతున్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి, మారన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధుత్వంతో స్టాలిన్ కుటుంబ సభ్యులు కూడా గ్రీస్‌లోని ఈ వివాహానికి ప్రత్యేక అతిథులుగా వెళ్లనున్నారు.

అనిరుధ్ తండ్రి, ప్రముఖ నటుడు రవిరాఘవేంద్ర కుటుంబంతో పాటు పలువురు తమిళ, తెలుగు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఒక్కటి కాదు.. ఏకంగా 3 గ్రాండ్ రిసెప్షన్లు

గ్రీస్‌లో కేవలం పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి వేడుక జరుగుతుందని సమాచారం. అయితే ఆ తర్వాత ఇండియాలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో భారీ ఎత్తున విందు కార్యక్రమాలను (Receptions) ప్లాన్ చేశారని తెలుస్తోంది.

1. సన్ నెట్‌వర్క్ ఉద్యోగుల కోసం ప్రత్యేక రిసెప్షన్: కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ తన సన్ నెట్‌వర్క్ సంస్థల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.

2. వ్యాపార, సెలబ్రిటీ వర్గాల కోసం మరొకటి: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, ఇతర రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖుల కోసం మరో ప్రత్యేక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

3. కోలీవుడ్, రాజకీయ వర్గాల కోసం చెన్నై రిసెప్షన్: చెన్నై వేదికగా తమిళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల తారలు, దర్శకులు, నిర్మాతలు, దేశంలోని అగ్ర రాజకీయ నాయకులందరి కోసం మూడో రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది.

ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి కళానిధి మారన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబుతోపాటు తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు విజయ్, డీకే శివకుమార్ లను ఆహ్వానించారు. ఈ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ రాయల్ కపుల్‌కి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More