Anirudh Kavya Invitation: దక్షిణాది చిత్రసీమతో పాటు బిజినెస్ రంగాన్ని షేక్ చేస్తున్న బిగ్గెస్ట్ సెలబ్రిటీ వెడ్డింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్‌గా రాణిస్తున్న అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత్రి, సన్ నెట్‌వర్క్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ (Kavya Maran) త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ వైరల్

అనిరుధ్, కావ్య పెళ్లి నవంబర్‌లో గ్రీస్ దేశంలో అత్యంత ఆత్మీయుల మధ్య ప్రైవేట్ వేడుకగా జరగనుండగా, నవంబర్ 21న తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత వైభవంగా గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. తాజాగా ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రిక నెట్టింట ప్రత్యక్షమై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఇన్విటేషన్ ఒక్కోటి రూ.15 వేల నుంచి రూ.20 వేల ఖరీదు ఉంటుందన్న వార్తలు మరింత షాక్ కు గురి చేస్తున్నాయి.
చెన్నైలో జరగనున్న ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, అల్లు అర్జున్ హాజరుకానున్నారు.
రాజసం ఒలికిపోతున్న 3D 'బరోక్' డిజైన్ కార్డ్
ఈ అరుదైన వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ప్రసిద్ధ డిజైన్ హౌస్ 'పింక్ విజిల్ మ్యాన్' (Pink Whistle Man) అధినేత్రి రంజని అయ్యంగార్ రూపొందించారు. సాధారణ శుభలేఖల కంటే భిన్నంగా, ఒక వింటేజ్ రాయల్ ఆర్ట్ పీస్‌లా దీనిని తీర్చిదిద్దారు.
పౌడర్ బ్లూ, ఐవరీ, సిల్వర్ కాంబినేషన్లో 3D చెక్కడాలు, సిల్వర్ ఓవల్ క్రెస్ట్ సీల్, ఎంబోస్డ్ లగ్జరీ స్టేషనరీతో ఈ ఇన్విటేషన్ బాక్స్ రూపుదిద్దుకుంది. రాయల్ 'బరోక్' (Baroque) ఆర్కిటెక్చర్ శైలి నుంచి ప్రేరణ పొంది రూపొందించిన ఈ కార్డు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ప్రధాని మోదీకి స్వయంగా పత్రిక అందించిన మారన్ కుటుంబం
{{/usCountry}}పౌడర్ బ్లూ, ఐవరీ, సిల్వర్ కాంబినేషన్లో 3D చెక్కడాలు, సిల్వర్ ఓవల్ క్రెస్ట్ సీల్, ఎంబోస్డ్ లగ్జరీ స్టేషనరీతో ఈ ఇన్విటేషన్ బాక్స్ రూపుదిద్దుకుంది. రాయల్ 'బరోక్' (Baroque) ఆర్కిటెక్చర్ శైలి నుంచి ప్రేరణ పొంది రూపొందించిన ఈ కార్డు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ప్రధాని మోదీకి స్వయంగా పత్రిక అందించిన మారన్ కుటుంబం
{{/usCountry}}ఈ బిగ్గెస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, ఆయన సతిమణి కావేరీ మారన్ స్వయంగా దేశంలోని ప్రముఖ రాజకీయ దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. అనిరుధ్ తల్లిదండ్రులు నటుడు రవి రాఘవేంద్ర, లక్ష్మీ రవిచందర్‌లతో కలిసి కళానిధి మారన్ దంపతులు ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలసి రిసెప్షన్ ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు.
అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కి కూడా అనిరుధ్, మారన్ కుటుంబం నేరుగా కలిసి ఆహ్వానం అందించారు. వీరితో పాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి.
సినీ రంగానికి చెందిన ప్రముఖుల లిస్ట్
రాజకీయ నాయకులతో పాటు సినీ, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో మెరవనున్నారు. అనిరుధ్ మేనమామ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరుండి ఈ వేడుకలను పర్యవేక్షిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, తమిళ స్టార్స్ అజిత్ కుమార్, శివకార్తికేయన్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చెన్నై గ్రాండ్ రిసెప్షన్‌కు హాజరుకానున్నారని పలు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.