Maatrubhumi: మోదీ సర్కార్‌కు అంత ధైర్యం లేదు.. అందుకే ఆ సినిమాను మళ్లీ షూట్ చేశారు: యూట్యూబర్ సంచలన ఆరోపణలు
Maatrubhumi: సల్మాన్ ఖాన్ మాతృభూమి మూవీ గురించి చెబుతూ మరోసారి మోదీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకున్నారు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ. ఈ సినిమాలో సీన్లను చైనాకు అనుకూలంగా మరోసారి షూటింగ్ చేయాల్సి వచ్చిందని అనడం గమనార్హం.
Maatrubhumi: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'మాతృభూమి' (Matrubhoomi) మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. గత కొంతకాలంగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా అనలిస్ట్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) ఈ సినిమా షూటింగ్ రీషూట్ వెనుక ఉన్న అసలు కారణాలంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఢిల్లీలో అక్టోబర్ 11న జరిగిన ఒక ప్రత్యేక ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. చైనాను వ్యతిరేకంగా చూపించే సన్నివేశాలను మార్చడం కోసమే ఈ సినిమాను బలవంతంగా రీషూట్ చేయించారంటూ ఆయన విమర్శించారు.
చైనాకు అనుకూలంగా మార్పులు చేయించారంటూ ఆరోపణ
'మాతృభూమి - మే వార్ రెస్ట్ ఇన్ పీస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి మొదట 'గాల్వన్' (Galwan) అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. అయితే రాజకీయ కారణాల వల్ల చిత్ర యూనిట్ టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ధ్రువ్ రాఠీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగానే సినిమాను మళ్లీ షూట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడిన ధ్రువ్ రాఠీ.. "సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఒక సినిమా చైనాకు వ్యతిరేకంగా కొన్ని అంశాలతో తెరకెక్కుతోంది. ఆ సినిమాను అలాగే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అస్సలు ఇష్టపడలేదు. చైనాను నెగెటివ్‌గా చూపించడం ఇష్టం లేకనే ఆ సినిమా పూర్తి షూటింగ్‌ను మళ్లీ చేయాల్సి వచ్చింది" అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం ఎవరికీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో రగులుతున్న కొత్త డిబేట్
ధ్రువ్ రాఠీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయ్యాయి. సల్మాన్ ఖాన్ డైరెక్ట్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సినిమాను కేవలం కమర్షియల్, క్రియేటివ్ కారణాల వల్లే మార్చారని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం జవాన్ల త్యాగాల నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమాలపై ఇలాంటి ఆంక్షలు ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని సాంగ్స్ రిలీజ్ కాగా, దీపావళి కానుకగా నవంబర్ 13న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే సెన్సార్ ప్రక్రియ, ప్రభుత్వ అనుమతుల విషయంలో నెలకొన్న ఈ వివాదాలు సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి నుంచీ మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న ధ్రువ్ రాఠీ.. తాజాగా సల్మాన్ ఖాన్ మాతృభూమి మూవీని తెరపైకి తీసుకురావడం గమనార్హం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


