Anirudh Kavya Invitation: అనిరుధ్, కావ్య వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ చూశారా? ఒక్కో కార్డు ధర వింటే షాకే..
Anirudh Kavya Invitation: అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ల వివాహ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 'పింక్ విజిల్ మ్యాన్' డిజైనర్ రంజని అయ్యంగార్ రూపొందించిన ఈ రాయల్ 3D వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్ ఒక అరుదైన కళాఖండంలా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Anirudh Kavya Invitation: దక్షిణాది చిత్రసీమతో పాటు బిజినెస్ రంగాన్ని షేక్ చేస్తున్న బిగ్గెస్ట్ సెలబ్రిటీ వెడ్డింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్‌గా రాణిస్తున్న అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత్రి, సన్ నెట్వర్క్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ (Kavya Maran) త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ వైరల్
అనిరుధ్, కావ్య పెళ్లి నవంబర్‌లో గ్రీస్ దేశంలో అత్యంత ఆత్మీయుల మధ్య ప్రైవేట్ వేడుకగా జరగనుండగా, నవంబర్ 21న తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత వైభవంగా గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. తాజాగా ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రిక నెట్టింట ప్రత్యక్షమై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఇన్విటేషన్ ఒక్కోటి రూ.15 వేల నుంచి రూ.20 వేల ఖరీదు ఉంటుందన్న వార్తలు మరింత షాక్ కు గురి చేస్తున్నాయి.
చెన్నైలో జరగనున్న ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, అల్లు అర్జున్ హాజరుకానున్నారు.
రాజసం ఒలికిపోతున్న 3D 'బరోక్' డిజైన్ కార్డ్
ఈ అరుదైన వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ప్రసిద్ధ డిజైన్ హౌస్ 'పింక్ విజిల్ మ్యాన్' (Pink Whistle Man) అధినేత్రి రంజని అయ్యంగార్ రూపొందించారు. సాధారణ శుభలేఖల కంటే భిన్నంగా, ఒక వింటేజ్ రాయల్ ఆర్ట్ పీస్‌లా దీనిని తీర్చిదిద్దారు.
పౌడర్ బ్లూ, ఐవరీ, సిల్వర్ కాంబినేషన్లో 3D చెక్కడాలు, సిల్వర్ ఓవల్ క్రెస్ట్ సీల్, ఎంబోస్డ్ లగ్జరీ స్టేషనరీతో ఈ ఇన్విటేషన్ బాక్స్ రూపుదిద్దుకుంది. రాయల్ 'బరోక్' (Baroque) ఆర్కిటెక్చర్ శైలి నుంచి ప్రేరణ పొంది రూపొందించిన ఈ కార్డు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ప్రధాని మోదీకి స్వయంగా పత్రిక అందించిన మారన్ కుటుంబం
ఈ బిగ్గెస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, ఆయన సతిమణి కావేరీ మారన్ స్వయంగా దేశంలోని ప్రముఖ రాజకీయ దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. అనిరుధ్ తల్లిదండ్రులు నటుడు రవి రాఘవేంద్ర, లక్ష్మీ రవిచందర్‌లతో కలిసి కళానిధి మారన్ దంపతులు ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలసి రిసెప్షన్ ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు.
అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కి కూడా అనిరుధ్, మారన్ కుటుంబం నేరుగా కలిసి ఆహ్వానం అందించారు. వీరితో పాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి.
సినీ రంగానికి చెందిన ప్రముఖుల లిస్ట్
రాజకీయ నాయకులతో పాటు సినీ, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో మెరవనున్నారు. అనిరుధ్ మేనమామ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరుండి ఈ వేడుకలను పర్యవేక్షిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, తమిళ స్టార్స్ అజిత్ కుమార్, శివకార్తికేయన్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చెన్నై గ్రాండ్ రిసెప్షన్‌కు హాజరుకానున్నారని పలు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


