Malayalam OTT Thriller: ఓటీటీలోకి మరో మైండ్ బ్లోయింగ్ మలయాళ రివెంజ్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లోనే.. 8.5 రేటింగ్
Malayalam OTT Thriller: నమ్మకద్రోహం, ప్రతీకారం నేపథ్యంలో అదిరిపోయే ట్విస్ట్ లతో తెరకెక్కిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. 8.5 ఐఎండీబీ రేటింగ్ ఉన్న ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మూవీ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
Malayalam OTT Thriller: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ వేరు. పగ, ప్రతీకారం, ఊహించని మలుపులతో కూడిన కథాంశాలతో మలయాళ దర్శకులు ప్రేక్షకులను నిత్యం కట్టిపడేస్తుంటారు. సరిగ్గా ఇదే తరహాలో ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపుదిద్దుకున్న తాజా మలయాళ క్రైమ్ రివెంజ్ డ్రామా 'అంకం అట్టహాసం' (Ankam Attahasam) డిజిటల్ ప్రవేశానికి సిద్ధమైంది.

మూడు నెలల తర్వాత
మలయాళ రివేంజ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంకం అట్టహాసం’ మూడు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. మే 8, 2026న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది.
8.5 రేటింగ్
మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంకం అట్టహాసం సినిమాకు ఐఎండీబీలో మంచి రేటింగ్ దక్కింది. ఈ చిత్రానికి 8.5 రేటింగ్ ఉంది. ఈ సినిమాలో మాధవ్ సురేష్, సైజు కురుప్, షైన్ టామ్ చాకో, అంబిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుజీత్ ఎస్ నాయర్ డైరెక్టర్.
మైండ్ గేమ్‌తో సాగే కథనం
నమ్మకద్రోహం, పగ, తీవ్రమైన భావోద్వేగాల చుట్టూ ఈ అంకం అట్టహాసం సినిమా కథ తిరుగుతుందని మేకర్స్ వెల్లడించారు. కథలో వచ్చే అనుకోని మలుపులు, మైండ్ గేమ్స్ వీక్షకులను తీవ్రమైన ఉత్కంఠకు గురిచేస్తాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రతీ సన్నివేశం సస్పెన్స్‌తో సాగుతూ ప్రేక్షకులను కథలో మమేకం చేసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
స్టోరీ ఇదే
తిరువనంతపురానికి చెందిన అజయ్ చంద్రన్ (మాధవ్ సురేష్) అనే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు అలన్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రికి వీరి ప్రేమ అస్సలు ఇష్టం ఉండదు. అజయ్‌ని చంపేయమని డేంజరస్ గ్యాంగ్‌స్టర్ 'కాకా సైజు' (సైజు కురుప్)కు ఆ తండ్రి సుపారీ ఇస్తాడు.
అజయ్ పై కాకా ఎటాక్ చేస్తాడు. అజయ్ తప్పించుకుంటాడు కానీ జీవితంలో చాలా కోల్పోతాడు. దీంతో పగ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. అండర్ వరల్డ్ లోకి అడుగుపెడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అజయ్ ఏం చేశాడన్నదే అంకం అట్టహాసం మూవీ స్టోరీ.
సన్ నెక్స్ట్‌లో ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ (Sun NXT) దక్కించుకుంది. ఆగస్టు 28 నుంచి ఈ చిత్రం సన్ నెక్స్ట్ వేదికగా వీక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.
సస్పెన్స్, డ్రామాను కోరుకునే ఓటీటీ ప్రియులకు 'అంకం అట్టహాసం' ఒక మంచి అనుభూతిని అందిస్తుంది. ఆగస్టు 28 నుంచి సన్ నెక్స్ట్ యాప్‌లో ఈ మైండ్ బ్లోయింగ్ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


