Balan The Boy: మలయాళ థ్రిల్లర్ పై మనసు పారేసుకున్న తెలుగు సెలబ్రిటీలు.. నవీన్ చంద్ర, నిహారిక కొణిదెల రివ్యూ చూశారా?
Balan The Boy: మలయాళ లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీపై తెలుగు సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్నారు. మస్ట్ వాచ్ అంటూ నిహారిక కొణిదెల, నవీన్ చంద్ర తమ రివ్యూలు చెప్పేశారు. ఇంతకీ ఈ మూవీ ఏంటీ? ఇందులో ఏముంది? అనేది ఇక్కడ చూసేయండి.
Balan The Boy: మలయాళంలో డిఫరెంట్ జోనర్ల సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ మూవీస్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ ‘బాలన్ ది బాయ్’ మూవీ తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు.

బాలన్ ది బాయ్ స్పెషల్ షో
టాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఇవాళ (జూన్ 21) అన్నపూర్ణ స్టూడియోలో బాలన్ ది బాయ్ మూవీ స్పెషల్ షో వేశారు. ఈ మూవీ చూసిన వర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ఇంప్రెస్ అయ్యాడు.
‘‘సినిమా చాలా బాగుంది. వచ్చేటప్పుడు ఒకలాగా ఉన్నా. వెళ్లేటప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఈ మూవీని ఇక్కడకు తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక్క క్యారెక్టర్ అని కాదు.. ఈ సినిమా ఓ డిఫరెంట్ వరల్డ్. తెలుగు డబ్ అయినా, మలయాళంలో అయినా, ఏ భాషలోనైనా సరే వచ్చి థియేటర్లలో చూడండి. ఈ సినిమా ను మిస్ అవొద్దు’’ అని నవీన్ చంద్ర తన రివ్యూ చెప్పాడు.
రేటింగ్, రివ్యూ కాదు
‘‘బాలన్ హార్ట్ స్టోలెన్. ఈ మూవీ రేటింగ్, రివ్యూ గురించి మాట్లాడుకోవద్దు. బ్యూటీఫుల్ మూవీ. మళ్లీ మళ్లీ చూడాలి’’ అని నవీన్ చంద్ర తెలిపాడు. ఈ బాలన్ ది బాయ్ స్పెషల్ షోకు నటి, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల కూడా అటెండ్ అయింది.
చాలా సంతోషంగా
‘‘ఈ సినిమాతో కొన్ని నెలలుగా అసోసియేట్ అవుతూ వస్తున్నా. మంచి హార్ట్ ఉన్న టీమ్ తీసిన మూవీ. చాలా గర్వంగా ఉంది. మూవీ ఆలోచన దగ్గర నుంచి పర్ఫార్మెన్స్, యాక్టింగ్.. అన్నీ టాప్ నాచ్. చాలా సంతోషంగా ఉంది. ఈ టీమ్ లో పార్ట్ కావడం హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ బాలన్ సినిమాను థియేటర్లలో చూడండి’’ అని నిహారిక కొణిదెల తెలిపింది.
చాలా రేర్
‘‘ఇలాంటి సినిమాలు రావడం చాలా రేర్. మలయాళంలో ఉన్న వాళ్లెవరూ హీరోలు కాదు వాళ్లు యాక్టర్లు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాకు హీరోలాగే కనిపించారు. ఈ సినిమాలో మనం యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి’’ అని డైరెక్టర్ యధువంశీ తన అభిప్రాయాన్ని పేర్కొన్నాడు.
ఆ డైరెక్టర్
మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ బాలన్ ది బాయ్ మూవీ జూన్ 19న థియేటర్లలో రిలీజైంది. దీనికి చిదంబరం డైరెక్టర్. మంజుమ్మల్ బాయ్స్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిదంబరం.. ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ బాలన్ ది బాయ్ ను తెరకెక్కించాడు. ఇందులో ఆదిశేషన్, ఫర్జానా, జినాన్, టొవినో, జీన్ పాల్, గిరీష్ తదితరులు నటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


