Anupama Parameswaran: ఆ హీరోతో బ్రేకప్? గత ఏడాది చాలా టఫ్‌గా గడిచిందంటూ అనుపమ పరమేశ్వరన్ కామెంట్లు
Anupama Parameswaran: తమిళ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్ వార్తలపై ఎట్టకేలకు అనుపమ పరమేశ్వరన్ రియాక్టయింది. గత ఏడాది తన జీవితంలో అత్యంత కష్టతరమైన దశ అని, ఒకానొక సమయంలో తనను తాను కోల్పోయినంత పని అయిందని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అసలు అనుపమ ఏం చెప్పిందో ఇక్కడ చూసేయండి.
Anupama Parameswaran: ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘టిల్లు స్క్వేర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). గత కొన్ని వారాలుగా సోషల్ మీడియా వేదికగా ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో (Dhruv Vikram) ప్రేమ, బ్రేకప్ వార్తలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి.

ధ్రువ్ తో అనుపమ బ్రేకప్
అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ కలిసి 'బైసన్ కాలమాడన్' (Bison Kaalamaadan) సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య ఏదో ఉందనే రూమర్ మొదలైంది. అయితే రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, వరుసగా ఎమోషనల్ పోస్టులు పెట్టడంతో బ్రేకప్ అయిందనే ప్రచారం జోరందుకుంది. తాజాగా ఈ వివాదంపై అనుపమ క్లారిటీనిచ్చింది.
క్రేజీ కళ్యాణం టీజర్
అనుపమ పరమేశ్వరన్ అప్ కమింగ్ తెలుగు మూవీ ‘క్రేజీ కళ్యాణం’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్లో అనుపమ కామెంట్స్ వైరల్ గా మారాయి. "గత ఏడాది నా జీవితంలో అత్యంత టఫ్ ఫేజ్ చూశా. తీవ్రమైన మానసిక ఘర్షణ అనుభవించాను. ఒకానొక దశలో నన్ను నేను పూర్తిగా కోల్పోయినట్లు అనిపించింది’’ అని అనుపమ చెప్పుకొచ్చింది.
నాకు పూర్తి కంట్రోల్ ఉంది
"నా జీవితంలో ఎక్కువ భాగం ఇతరుల సంతోషం కోసమే జీవించాను. కానీ ఆ ప్రతికూల అనుభవాలు నాకు ఒక విషయాన్ని నేర్పాయి. మన జీవితంలో మనకే ప్రాధాన్యత ఇచ్చుకోవాలని అర్థమైంది. ప్రస్తుతం నా జీవితంపై నాకు పూర్తి నియంత్రణ వచ్చింది. ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. గత జ్ఞాపకాలను వదిలేసి ముందుకే సాగుతున్నాను. నా వ్యక్తిగత జీవితంలోని ప్రతి అంశాన్ని అందరికీ వివరించాల్సిన అవసరం నాకు లేదు. కొన్ని అనుభవాలు వ్యక్తిగతంగా ఉంచుకోవడమే మంచిది’’ అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.
హీరో పేరు చెప్పకపోయినా
అనుపమ పరమేశ్వరన్ నేరుగా పేరు చెప్పనప్పటికీ హీరో ధ్రువ్ విక్రమ్ తో ఆమె రిలేషన్ షిప్ కు ఎండ్ కార్డు పడినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ బ్రేకప్ ఆమెను ఎక్కువగా బాధించినట్లు సమాచారం. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చిన అనుపమ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
ఇక తరుణ్ భాస్కర్, సీనియర్ నటుడు నరేష్, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


