Kriti Sanon: బ్రేకప్ రూమర్లకు కృతి సనన్ చెక్ పెట్టినట్లేనా? బాయ్ ఫ్రెండ్ కబీర్ తో పిక్ వైరల్!

Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్, కబీర్ బాహియాల మధ్య బ్రేకప్ జరిగిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ పుకార్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటో పోస్టు చేసింది.

Published on: Jul 1, 2026, 11:48:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kriti Sanon: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కృతి సనన్ గత కొంతకాలంగా లండన్‌కు చెందిన బిజినెస్‌మెన్ కబీర్ బాహియాతో ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. ఈ పుకార్లపై నేరుగా స్పందించకపోయినప్పటికీ, కృతి తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్‌తో రూమర్ రాయుళ్ల నోళ్లు నొక్కేసింది.

బ్రేకప్ రూమర్లకు కృతి సనన్ చెక్ పెట్టినట్లేనా? బాయ్ ఫ్రెండ్ కబీర్ తో పిక్ వైరల్!
బ్రేకప్ రూమర్లకు కృతి సనన్ చెక్ పెట్టినట్లేనా? బాయ్ ఫ్రెండ్ కబీర్ తో పిక్ వైరల్!

'హాఫ్ ఇయర్లీ డంప్' ఫోటోలతో క్లారిటీ!

తాజాగా కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గత ఆరు నెలలకు సంబంధించిన కొన్ని అరుదైన, అన్‌సీన్ క్షణాలను ‘హాఫ్ ఇయర్లీ డంప్’ పేరుతో పంచుకుంది. అందులో తన పెంపుడు కుక్కతో ప్రయాణాలు, సోదరి నుపూర్ సనన్‌తో స్నో వెకేషన్, అలాగే ‘కాక్‌టెయిల్ 2’ కో-స్టార్ రష్మిక మందన్నతో ఉన్న ఫోటోలు ఉన్నాయి.

కబీర్ బాహియాతో పిక్

అయితే వీటన్నింటిలోకి అభిమానుల దృష్టిని ఆకర్షించింది కబీర్ బాహియాతో ఉన్న ఫోటోనే. ఒక లైవ్ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఒకరినొకరు కౌగిలించుకుని ఉన్న పిక్‌ను కృతి షేర్ చేశారు. ఇందులో కబీర్ షేర్వాణీలో ఉండగా, కృతి బ్లాక్ హూడీలో క్యాజువల్‌గా కనిపించింది. ఈ ఒక్క ఫోటోతో తామిద్దరం ఇంకా రిలేషన్‌లోనే ఉన్నామనే విషయాన్ని ఆమె పరోక్షంగా స్పష్టం చేసినట్లు అయిందనే టాక్ జోరందుకుంది.

వైరల్ ఫోటో వెనుక అసలు నిజం

గత వారం ఒక వివాహ వేడుకలో కబీర్ బాహియా వేరే అమ్మాయితో కలిసి ఉన్న ఫోటో రెడ్డిట్ వేదికగా వైరల్ అయ్యింది. దీంతో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ ప్రచారం జరగగా, కబీర్ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాకు అసలు నిజాన్ని వెల్లడించాయి.

"కబీర్ వేరే అమ్మాయితో ఉన్న ఫోటోను జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆమె కబీర్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు, పైగా ఆమెను అతను తన సోదరిలా భావిస్తాడు. విషయాలు పూర్తిగా తెలియకుండానే కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు" అని పేర్కొన్నాయి.

పెళ్లి వరకు నో పర్సనల్ లైఫ్

ఇటీవల టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో కృతి సనన్ తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సోదరి నుపూర్ సనన్, సింగర్ స్టెబిన్ బెన్ వివాహ వేడుకలో కబీర్ ప్రత్యేకంగా కనిపించడంపై స్పందిస్తూ.. "నాకు పెళ్లయ్యేంత వరకు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నేను ఇష్టపడను. ఏ రోజు అయితే నాకు వివాహం అవుతుందో ఆ రోజే దీనిపై మాట్లాడతాను. కొన్ని విషయాలు కేవలం నాకు, నా కుటుంబానికి మాత్రమే పరిమితం" అని కృతి సనన్ చెప్పింది.

కాక్‌టెయిల్ 2 హవా

కృతి సనన్, షాహిద్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కాక్‌టెయిల్ 2’ (Cocktail 2) ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.103.50 కోట్ల గ్రాస్ (రూ.86.80 కోట్ల నెట్) వసూళ్లు సాధించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More