Anushka Sharma: కోహ్లి విన్నింగ్ సిక్స్.. స్టేడియంలో అనుష్క శర్మ క్రేజీ సెలబ్రేషన్స్ వైరల్.. ముద్దులు విసురుతూ!
Anushka Sharma: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని భార్య అనుష్క శర్మ ఇచ్చిన అదిరిపోయే రియాక్షన్లు, సెలబ్రేషన్లు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Anushka Sharma: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అంతటా ఒకవైపు విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో మైదానాన్ని శాసిస్తుంటే, మరోవైపు విఐపి స్టాండ్స్ నుంచి అనుష్క శర్మ రియాక్షన్స్ వైరల్ గా మారాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో ప్రతి బంతికీ అనుష్క ముఖంలో ఎమోషన్స్ మారిపోయాయి. ఇక ఆర్సీబీ విక్టరీ తర్వాత ఆమె ఆనందానికి అవధులేకుండా పోయాయి.

అనుష్క శర్మ సెలబ్రేషన్స్
ఐపీఎల్ 2026 ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి వరుసగా రెండో సారి విజేతగా నిలిచింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 75 రన్స్ తో నాటౌట్ గా నిలిచి టీమ్ ను గెలిపించాడు. అతను విన్నింగ్ సిక్సర్ కొట్టిన వెంటనే కోహ్లి భార్య అనుష్క శర్మ సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ట్రెండ్ అయ్యాయి.
విన్నింగ్ మూమెంట్
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లి ఒక అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కోహ్లి ఆ సిక్స్ కొట్టగానే అనుష్క శర్మ గాల్లోకి లేచి గెంతులేస్తూ సంబరాలు చేసుకుంది. వెంటనే తన పక్కన ఉన్నవారిని హగ్ చేసుకుని, చప్పట్లతో స్టేడియాన్ని హోరెత్తించింది.
భర్తకు ముద్దులు
అనంతరం మైదానంలో ఉన్న తన భర్త విరాట్ కోహ్లిని చూస్తూ ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ అనుష్క శర్మ మురిసిపోయింది. భర్త సాధించిన విజయ గర్వం ఆమె నవ్వులో స్పష్టంగా కనిపించింది. ఆర్సీబీ ఐపీఎల్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ అత్యంత కీలకంగా నిలిచింది.
ఫ్యాన్స్ రియాక్షన్
స్టేడియంలో అనుష్క శర్మ చేసిన సందడి చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
"విరాట్ కోహ్లి ఆర్సీబీ కోసం విన్నింగ్ సిక్స్ కొట్టినప్పుడు, అందరికంటే ఎక్కువ సంతోషపడింది అనుష్క శర్మనే. ఆమెలోని విరాట్ కోహ్లి ఆ క్షణంలో నిద్రలేచాడు!" అని ఒక అభిమాని ఎక్స్ (ట్విట్టర్) లో రాసుకొచ్చాడు.
"అనుష్క శర్మ మా ఆర్సీబీ జట్టుకు ఎప్పుడూ లక్కీ చార్మ్" అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
"వీరిద్దరూ మా పాలిట రోమన్ ఎంపైర్ లాంటి వారు" అని క్రికెట్ లవర్స్ కామెంట్లు పెడుతున్నారు.
"ఈ మ్యాచ్‌లోనే ఇది అత్యంత క్యూట్ మూమెంట్" అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆ ఫొటో
మ్యాచ్ ముగిసిన అనంతరం అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను పంచుకుంది. అందులో విరాట్ కోహ్లి ధరించిన టీషర్ట్‌పై "ఒకసారి గెలిస్తే బాగుంది అనిపించింది, ఇప్పుడు రెండోసారి కూడా చేసేశాం" అనే ఆసక్తికరమైన వ్యాఖ్య ఉంది. ఆ తర్వాత ఆమె మైదానంలోకి వచ్చి విరాట్ కోహ్లి, ఇతర జట్టు సభ్యులు, వారి కుటుంబాలతో కలిసి ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలకు పోజులిచ్చారు.
అలా మొదలైంది
విరాట్ కోహ్లి, అనుష్క శర్మల పరిచయం ఒక షాంపూ యాడ్ షూటింగ్ సమయంలో జరిగింది. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. డిసెంబర్ 2017లో ఇటలీలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. వీరికి 2021లో కుమార్తె వామిక, 2024లో కుమారుడు అకాయ్ జన్మించారు. సెలబ్రిటీలైనప్పటికీ వీరు తమ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు.
వెండితెరకు దూరంగా అనుష్క శర్మ
సినిమాల విషయానికి వస్తే అనుష్క శర్మ చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో కలిసి నటించిన 'జీరో' (2018) చిత్రంలో ఆమె చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత భారత మహిళా క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వామి బయోపిక్ 'చక్దా ఎక్స్‌ప్రెస్' లో నటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేశాడు?
జవాబు: విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 75 పరుగులు చేసి ఆర్‌సీబీకి విజయాన్ని అందించాడు.
ప్రశ్న: ఐపీఎల్ 2026 ఫైనల్ ఏ జట్ల మధ్య జరిగింది?
జవాబు: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్ల మధ్య జరిగింది. ఇందులో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్రశ్న: అనుష్క శర్మ చివరిగా నటించిన సినిమా ఏది?
జవాబు: అనుష్క శర్మ చివరిసారిగా 2018లో వచ్చిన 'జీరో' సినిమాలో నటించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


