Anushka Sharma: అనుష్క శర్మ సరికొత్త లుక్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో హాట్ డిబేట్!
Anushka Sharma: చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న అనుష్క శర్మ తాజాగా ఒక కొత్త యాడ్‌లో కనిపించింది. అయితే, ఆమె ముఖం పూర్తిగా మారిపోయిందని, గుర్తుపట్టలేనంతగా ఉందంటూ నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
Anushka Sharma: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ వెండితెరపై కనిపించి దాదాపు పదేళ్లు కావస్తున్నా, ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విరాట్ కోహ్లీ సతీమణిగా, స్టార్ యాక్ట్రెస్ గా ఆమె ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తాజాగా ఒక కొత్త యాడ్ లో అనుష్క తళుక్కుమని మెరిసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చాలా నెలల తర్వాత ఆమెను స్క్రీన్ పై చూసి ఖుషీ అవుతున్నప్పటికీ, ఆమె లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

యాడ్‌లో కొత్త లుక్
'హీరా బై జీవా' (Heera by GIVA) అనే సంస్థకు సంబంధించిన యాడ్ లో అనుష్క శర్మ మెరిసింది. యూట్యూబ్‌లో ఈ వీడియోకు పెద్దగా స్పందన రాకపోయినా, రెడ్డిట్ (Reddit), ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మాత్రం ఇది తెగ వైరల్ అవుతోంది.
"చాలా కాలం తర్వాత ఆమెను (అనుష్క శర్మ) తెరపై చూడటం సంతోషంగా ఉంది" అని కొందరు కామెంట్ చేస్తుంటే, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆమె ముఖంలో ఏదో మార్పు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
గుర్తుపట్టలేనంతగా అనుష్క?
ఈ వీడియోలో అనుష్కను చూసిన కొందరు నెటిజన్లు ఆమెను గుర్తుపట్టలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. "ఆమె ముఖంలో ఏదో తేడా ఉంది, అది ఏమిటో స్పష్టంగా అర్థం కావడం లేదు" అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఏమో.. "ఆమె ఏమైనా సర్జరీ చేయించుకుందా? లేక వీడియో ఎడిటింగ్ లో వచ్చిన మార్పా? అసలు సహజంగా కనిపించడం లేదు" అని అనుమానం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఆమె ప్రవర్తన, లుక్స్ లో మార్పు వచ్చిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
అండగా ఫ్యాన్స్
మరోవైపు అనుష్క అభిమానులు ఈ విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లలో, టీ20 వరల్డ్ కప్ సమయంలో ఆమె స్టేడియానికి వచ్చినప్పుడు కూడా మనం చూశాం కదా అని గుర్తు చేస్తున్నారు. వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులే తప్ప ఇందులో వింతేమీ లేదని వారు వాదిస్తున్నారు.
ఒక మహిళా నెటిజన్ స్పందిస్తూ.. "ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె ఇప్పటికీ ఎంతో అందంగా ఉన్నారు. డెలివరీ తర్వాత మునుపటి రూపం రావడం అంత సులభం కాదు. ఆమె శారీరక మార్పుల గురించి విమర్శించడం పద్ధతి కాదు" అని మద్దతుగా నిలిచారు.
అనుష్క సినీ ప్రయాణం
2008లో 'రబ్ నే బనా దీ జోడీ' చిత్రంతో షారుఖ్ ఖాన్ సరసన టీనేజర్ గా అనుష్క తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 'బ్యాండ్ బాజా బారాత్', 'పీకే', 'దిల్ ధడక్నే దో', 'సంజూ' వంటి సూపర్ హిట్ చిత్రాలతో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. 2018లో వచ్చిన 'జీరో' హీరోయిన్ గా ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత తన సొంత బ్యానర్ లో వచ్చిన 'ఖలా' సినిమాలో కామియో రోల్ లో మెరిశారు. భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ 'చక్దా ఎక్స్‌ప్రెస్' షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, ఆ సినిమా విడుదలపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. అనుష్క శర్మ చివరగా నటించిన సినిమా ఏది?
అనుష్క శర్మ 2018లో విడుదలైన 'జీరో' చిత్రంలో కథానాయికగా నటించారు. ఆ తర్వాత 'చక్దా ఎక్స్‌ప్రెస్' చిత్రంలో నటించినా అది ఇంకా విడుదల కాలేదు.
2. అనుష్క శర్మ కొత్త యాడ్ దేనికి సంబంధించింది?
అనుష్క శర్మ తాజాగా 'హీరా బై జీవా' (Heera by GIVA) అనే జువెలరీ బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో కనిపించారు.
3. అనుష్క లుక్ పై నెటిజన్ల విమర్శలేమిటి?
ఆమె ముఖంలో మార్పులు వచ్చాయని, గుర్తుపట్టలేనంతగా మారిపోయారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఎడిటింగ్ లేదా కాస్మెటిక్ సర్జరీ కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


