Pawan Kalyan : తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ - వైద్యుల సూచనతో సర్జరీ..! ఏం జరిగిందంటే..?

Pawan Kalyan Surgery : ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన… వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. 

Published on: Apr 18, 2026, 20:33:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శనివారం సాయంత్రం వైద్యులు ఆయనకు ఈ ఆపరేషన్ నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్

అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్…

శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ తన కార్యాలయ అధికారులతో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకున్నారు. పరిస్థితిని గమనించిన వైద్యులు… ఆ రోజు జరగాల్సిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆసుపత్రికి రావాలని సూచించారు.

ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్‌కు వైద్యులు వివిధ రకాల పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ. (MRI) స్కాన్ కూడా నిర్వహించారు. పరీక్షా ఫలితాలను విశ్లేషించిన నిపుణులు, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.

10 రోజులు విశ్రాంతి….

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ.. శస్త్రచికిత్స తర్వాత ఆయన కనీసం వారం నుండి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాతే ఆయన మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయిత…, ఆయన పూర్తిస్థాయిలో స్వస్థత చేకూరడానికి మరికొంత కాలం పడుతుందని, దీర్ఘకాలం పాటు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు.

“వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని….. పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు” అని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ అధకారిక ప్రకటన విడుదల చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…. అస్వస్థతకు గురై ఆపరేషన్ చేయించుకున్నారన్న వార్త తెలియడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులతో పాటు టాలీవుడ్ హీరోలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More