...
...
Next Story

AR Rahman: రామాయణ మూవీ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. పెద్ద డైరెక్టర్లకు కూడా నో చెప్పా: ఏఆర్ రెహమాన్ కామెంట్స్

AR Rahman: బాక్సాఫీస్ వద్ద రూ.1693 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న నితీష్ తివారీ, నమిత్ మల్హోత్రా భారీ పౌరాణిక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' కోసం తాను ఏకంగా 10 నుంచి 12 సినిమాలను వదులుకున్నట్లు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. పెద్ద డైరెక్టర్లకు కూడా నో చెప్పినట్లు తెలిపారు.

Published on: Nov 23, 2026, 12:38:45 IST
Advertisement

AR Rahman: రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Part 1) బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు సృష్టిస్తోంది. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ దృశ్యకావ్యానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.

AR Rahman: రామాయణ మూవీ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. పెద్ద డైరెక్టర్లకు కూడా నో చెప్పా: ఏఆర్ రెహమాన్ కామెంట్స్ (Photo by FleckMedia)
AR Rahman: రామాయణ మూవీ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. పెద్ద డైరెక్టర్లకు కూడా నో చెప్పా: ఏఆర్ రెహమాన్ కామెంట్స్ (Photo by FleckMedia)

అయితే ఈ సినిమాకు సంగీతం అందించేందుకు ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మర్ (Hans Zimmer) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. తాజాగా గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికపై ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం తాను చేసిన త్యాగాలను బయటపెట్టారు.

"పెద్ద దర్శకుల 10-12 సినిమాలను వదులుకున్నా.. అందుకు గర్వపడుతున్నా!"

ఆదివారం జరిగిన ఇఫీ (IFFI) చర్చాగోష్టిలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్.. 'రామాయణం' సంగీత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

“మేము గత మూడేళ్లుగా 'రామాయణం' సంగీతం, థీమ్ మ్యూజిక్‌పై పనిచేస్తున్నాం. ఇందులోని కొన్ని ట్యూన్ల కోసం ఏకంగా 12 నుంచి 13 వెర్షన్లు సిద్ధం చేశాం. ముఖ్యంగా 'రావణ తాండవం' పాటకు 12-13 వెర్షన్లు చేసిన తర్వాతే అందరికీ నచ్చే ఫైనల్ వెర్షన్ దొరికింది” అని రెహమాన్ తెలిపారు.

“ఈ ప్రాజెక్ట్ చాలా అందమైనది. పూర్తిగా ఆ జోన్‌లోనే ఉండి పనిచేయడం కోసం నేను దాదాపు 10 నుంచి 12 సినిమాలను వదులుకున్నాను. ఎంతోమంది ప్రముఖ, పెద్ద దర్శకుల ఆఫర్లను కూడా సున్నితంగా తిరస్కరించాను. కానీ అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నా కళాత్మక తృష్ణను తీర్చే ప్రాజెక్టులనే నేను ఎంచుకుంటాను” అని రెహమాన్ స్పష్టం చేశారు.

ఒకవైపు బాక్సాఫీస్ జాతర.. మరోవైపు సంగీతంపై భిన్నాభిప్రాయాలు

అయితే ఈ స్థాయి భారీ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను రెహమాన్-జిమ్మర్ ద్వయం పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిందనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యశ్ పాత్ర కోసం రూపొందించిన 'రావణ తాండవం' పాటలో రావణుడి గాంభీర్యం, సంప్రదాయ శబ్దం లోపించాయని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తుండగా, 'మంగళ్ రంగ్' పాటలో ఖవ్వాలీ పోకడలు ఎక్కువయ్యాయని వివాదం నెలకొంది.

ఈ విమర్శలు ఎలా ఉన్నా, రవి దూబే లక్ష్మణుడిగా నటించిన 'రామాయణం: పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియాలో రూ.920 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,693 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks