Ramayana Collection: 1600 కోట్లు దాటిన రామాయణం కలెక్షన్స్- 4 వేల కోట్ల బడ్జెట్ వస్తుందా? కైకేయి పాత్ర ఏం చెప్పిందంటే?

Ramayana Box Office Collection Day 17: రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటించిన రామాయణం కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన 17 రోజుల్లోనే ఈ చిత్రం ఇండియాలో వెయ్యి కోట్లు, వరల్డ్ వైడ్‌గా 1600 కోట్లు దాటేసింది. మరి 4 వేల కోట్ల బడ్జెట్‌ను రాబడుతుందా అనే ప్రశ్నపై కైకేయి పాత్ర లార దత్తా సమాధానమిచ్చారు.

Published on: Nov 22, 2026, 09:12:32 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana 17 Days Worldwide Collection: భారతీయ సినీ చరిత్రలో 'రామాయణ' బాక్సాఫీస్ ప్రభంజనం ఆగడం లేదు. నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ పౌరాణిక దృశ్యకావ్యం మూడో వారంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి సెలవులు ముగిసినా థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గలేదు.

1600 కోట్లు దాటిన రామాయణం కలెక్షన్స్- 4 వేల కోట్ల బడ్జెట్ వస్తుందా? కైకేయి పాత్ర ఏం చెప్పిందంటే?
1600 కోట్లు దాటిన రామాయణం కలెక్షన్స్- 4 వేల కోట్ల బడ్జెట్ వస్తుందా? కైకేయి పాత్ర ఏం చెప్పిందంటే?

900 కోట్ల క్లబ్‌లో రామాయణం

నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామాయణం చిత్రం తాజాగా రూ. 900 కోట్ల ప్రతిష్ఠాత్మక క్లబ్‌లోకి అడుగుపెట్టి మరో భారీ మైలురాయిని అందుకుంది. సాయి పల్లవి సీతమ్మగా ఒదిగిపోవడం, 'కేజీఎఫ్' సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా విశ్వరూపం చూపించడం ఈ చిత్రానికి కలిసొచ్చింది.

అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రికార్డుల వేట

శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటనతోపాటు కళ్లు చెదిరే విజువల్స్ తోడవ్వడంతో దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. విడుదలకు 15 రోజుల ముందే దసరా పండుగ సందర్భంగా 'రామాయణ' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. థియేటర్లలోకి రాకముందే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.

తొలిరోజు భారత్‌లో రూ. 64.85 కోట్లు వసూలు చేసి, బాలీవుడ్ చరిత్రలో నాలుగో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రీ-దివాళీ విడుదలైన చిత్రాల్లో ఇదే అత్యధిక ఓపెనింగ్. మొదటి రెండు రోజుల తర్వాత దీపావళి సెలవులు కలిసిరావడంతో వసూళ్లు అమాంతం పెరిగాయి.

సోమవారం రూ. 107 కోట్ల నెట్, మంగళవారం రూ. 94 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి భారతీయ సినీ చరిత్రలోనే ఆయా రోజుల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. విడుదలైన ఆరు రోజుల్లోనే, తొలి వారం ముగిసేసరికి రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

మూడో శనివారం జోరు.. భారీ బ్లాక్‌బస్టర్లు వెనక్కి

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ తాజా గణాంకాల ప్రకారం, 'రామాయణ' మూడో శనివారం (17వ రోజు- నవంబర్ 21) ఇండియాలో ఏకంగా రూ. 43.15 కోట్లు వసూలు చేసింది. దీంతో భారత్‌లో రామాయణం సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 906.90 కోట్లకు చేరాయి.

ఫలితంగా ఎన్నో భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాల లైఫ్‌టైమ్ వసూళ్లను ఈ చిత్రం అధిగమించింది. రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్', విక్కీ కౌశల్ 'ఛావా', షారుఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రాలతో పాటు రణ్‌బీర్ కపూర్ గత చిత్రం 'యానిమల్' జీవితకాల కలెక్షన్లను 'రామాయణం' దాటేసింది.

ఇక వరల్డ్ వైడ్‌గా 17 రోజుల్లో రామాయణం మూవీ రూ. 1616.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, ఇండియాలో రూ. 1083.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రూ. 533 కోట్ల గ్రాస్ వచ్చింది.

రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్.. రెండో భాగంపై అంచనాలు

ఇదిలా ఉంటే.. మహర్షి వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, వీఎఫ్ఎక్స్ దిగ్గజం డీనెగ్ (DNEG), యశ్ సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇందులో లక్ష్మణుడిగా రవి దూబే, ఆంజనేయుడిగా సన్నీ డియోల్ నటించారు. మొదటి భాగం నవంబర్ 5, 2026న విడుదలవ్వగా, రెండో భాగాన్ని 2028 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రెండు భాగాలకు కలిపి సుమారు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటంతో, పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా అన్న చర్చ విడుదలకు ముందు జరిగింది.

లారా దత్తా కామెంట్స్

దీనిపై కైకేయి పాత్ర పోషించిన నటి లారా దత్తా స్పందించారు. "ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకుంటుందా లేదా అన్న సందేహం అక్కర్లేదు. కేవలం బాక్సాఫీస్ వసూళ్లతోనే కాకుండా, నిర్మాత నమిత్ మల్హోత్రా వేసుకున్న ప్రణాళికలతో బడ్జెట్‌ను ఎప్పుడో దాటేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని లారా దత్తా ఎన్డీటీవీ (NDTV) ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.