Sai Pallavi Grandfather: రామాయణంలో సాయి పల్లవి నటించలేదు- తాతయ్య మాటలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్- ఒత్తిడిని పెంచేదంటూ!

Sai Pallavi About Grandfather Comments On Ramayana: రామాయణ సినిమాలో సీతగా సాయి పల్లవి నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు మాత్రం రామాయణంలో సాయి పల్లవి అస్సలు నటించలేదని ఆమె తాతయ్య అన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఆ వీడియో వెనుక ఉన్న అసలు అర్థాన్ని సాయి పల్లవి వివరించారు.

Published on: Nov 19, 2026, 13:20:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sai Pallavi About Grandfather Comments On Ramayana: 'ఫిదా', 'శ్యామ్ సింగరాయ్' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల సొంత అమ్మాయిగా మారిపోయిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, తాజాగా 'రామాయణ' చిత్రంలో సీతాదేవి పాత్రతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.

రామాయణంలో సాయి పల్లవి నటించలేదు- తాతయ్య మాటలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్- ఒత్తిడిని పెంచేదంటూ!
రామాయణంలో సాయి పల్లవి నటించలేదు- తాతయ్య మాటలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్- ఒత్తిడిని పెంచేదంటూ!

సాయి పల్లవి నటనకు ప్రశంసలు

నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన రామాయణ సినిమాలో సాయి పల్లవి అభినయానికి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో సాయి పల్లవి తాతయ్య మాట్లాడిన ఒక వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

'రామాయణ'లో సాయి పల్లవి నటించలేదని ఆయన అన్నట్లు ఆ వీడియోలో ఉండటంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ వీడియోపై స్పందిస్తూ అసలు నిజాన్ని వెల్లడించారు.

అసలు తాతయ్య ఏమన్నారంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను సగంలోనే కట్ చేసి పోస్ట్ చేశారని, అందుకే అపార్థాలకు తావిచ్చిందని సాయి పల్లవి స్పష్టం చేశారు. 'బిహైండ్‌వుడ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ ఆ వ్యాఖ్యల పూర్తి నేపథ్యాన్ని వివరించారు.

"నిజానికి మా తాతయ్య పూర్తిగా ఏమన్నారంటే.. 'ఈ సినిమాలో సాయి పల్లవి నటించిందని నేను అనుకోవడం లేదు, ఆ దేవుడే ఆమె ద్వారా నటింపజేశాడు' అని చెప్పారు" అంటూ సాయి పల్లవి అసలు విషయాన్ని బయటపెట్టారు. మనవరాలు సీత పాత్రలో అంతగా ఒదిగిపోయిందని ఆయన భావోద్వేగంతో అన్న మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునేలా ఎడిట్ చేశారని సాయి పల్లవి తెలిపారు.

చిన్నప్పటి నుంచే దేవతలతో పోలిక..

గతంలో 'బ్రిట్ ఆసియా టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సాయి పల్లవి తన తాతయ్య, నానమ్మలతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తమ ఇంట్లో పిల్లలను ఎంతో పవిత్రంగా చూసేవారని సాయి పల్లవి గుర్తుచేసుకున్నారు.

"మా తాతయ్య, నానమ్మలు చిన్నప్పుడు మమ్మల్ని దేవుళ్లు, దేవతలు అని పిలిచేవారు. మేము ఏదైనా తప్పు చేస్తే 'నువ్వు దేవతవి, ఇలాంటి పనులు చేయకూడదు' అని మందలించేవారు. అది మాపై ఒక రకమైన బాధ్యతను, ఒత్తిడిని పెంచేది" అని సాయి పల్లవి తన బాల్య జ్ఞాపకాలను వివరించారు.

ఇక రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన రామాయణం చిత్రంలో సీతాదేవిగా నటించే అవకాశం రాగానే తాను ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని సాయి పల్లవి చెప్పారు. "నాకు సీత పాత్రలో నటించే అవకాశం రాగానే, ఈ విషయాన్ని అందరికంటే ముందుగా మా తాతయ్య, నానమ్మలకే చెప్పాను. అది విని వాళ్లు ఎంతో సంతోషించారు" అని ఆమె పేర్కొన్నారు.

ఆ పాత్ర కోసం ధ్యానం చేశా..

పౌరాణిక పాత్రల్లో, అందులోనూ ఒక దేవత పాత్రలో నటించడం కత్తిమీద సాము లాంటిదని సాయి పల్లవి అభిప్రాయపడ్డారు. జులైలో జరిగిన సినిమా ప్రచార కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు.

"ఇలాంటి గొప్ప పాత్రలు దక్కడం నటీనటులకు అంత సులభం కాదు. ఎందుకంటే ఒక దేవత పాత్రలో జీవించడం చాలా కష్టం. దీని వెనుక ఒక బృందం మొత్తం ప్రాణం పెట్టి పనిచేయాలి. సీతమ్మ పాత్రను నేను ఎంచుకోలేదు, ఆ పాత్ర చేసే అదృష్టం నాకు దక్కిందని భావిస్తున్నాను. సెట్స్‌కు వెళ్లే ముందు కళ్లు మూసుకుని ధ్యానం చేస్తూ.. 'సీతమ్మా, నువ్వే నా ద్వారా నటించు. ఈ సినిమాకు ఏది అవసరమో అదే నా నుంచి బయటకు వచ్చేలా చూడు' అని వేడుకునేదాన్ని" అని సాయి పల్లవి వివరించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More